India vs New Zealand: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 చివరి మ్యాచ్ భారత్-న్యూజిలాండ్ (India vs New Zealand) మధ్య మార్చి 9న దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగనుంది. ఇప్పుడు కోట్లాది మంది అభిమానుల కళ్లు ఈ మ్యాచ్ పైనే ఉన్నాయి. ఈ టోర్నమెంట్‌లో ఇప్పటివరకు టీమ్ ఇండియా ఒక్క మ్యాచ్‌లో కూడా ఓడిపోలేదు. అయితే టీమ్ ఇండియాతో జరిగిన ఏకైక మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఇప్పుడు ఈ సీజన్‌లో ఈ రెండు జట్లు రెండోసారి తలపడనున్నాయి. మరోవైపు ఫైనల్ మ్యాచ్ టై అయితే ఫలితం ఎలా ఉంటుందో, ఏ జట్టు చాంపియన్ అవుతుందో అన్న ప్రశ్న అభిమానుల మదిలో మెదులుతోంది.
మ్యాచ్ టై అయిన తర్వాత ఫలితం ఎలా ప్రకటిస్తారు?
ప్రస్తుతం భారత జట్టు అద్భుతమైన స్థితిలో ఉంది. గ్రూప్ దశలో బంగ్లాదేశ్, పాకిస్థాన్, న్యూజిలాండ్ జట్లను రోహిత్ సేన ఓడించింది. దీని తర్వాత వారు సెమీ-ఫైనల్స్‌లో బలమైన ఆస్ట్రేలియా జట్టును ఓడించారు. టీమిండియా మూడవ ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్‌పై కన్నేసింది. ఒకవేళ ఈ మ్యాచ్ టైగా ముగిస్తే సూపర్ ఓవర్ ద్వారా మ్యాచ్ ఫలితం తేలనుంది.
Also Read: Ammoru Thalli 2: నయనతార అమ్మోరు తల్లి 2 పనులు మొదలు.. ఘనంగా పూజా కార్యక్రమాలు!
మరోవైపు వర్షం కారణంగా ఫైనల్ రద్దైతే మ్యాచ్‌కి రిజర్వ్ డే ఉంచారు. అయితే వాతావరణ శాఖ వెబ్‌సైట్‌ల ప్రకారం.. మ్యాచ్ రోజు వాతావరణం స్పష్టంగా ఉంటుందని, దీని కారణంగా ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్‌ను ఎటువంటి ఆటంకం లేకుండా ఆడవచ్చు.
న్యూజిలాండ్ దక్షిణాఫ్రికాను ఓడించి ఫైనల్స్‌కు చేరుకుంది
రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ న్యూజిలాండ్, సౌతాఫ్రికా జట్ల మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో కివీస్ జట్టు 50 పరుగుల తేడాతో ఆఫ్రికాపై విజయం సాధించి ఫైనల్ టికెట్ ఖాయం చేసుకుంది. న్యూజిలాండ్ జట్టు కూడా అద్భుత ఫామ్‌లో కనిపిస్తోందని, బ్యాటింగ్ నుండి బౌలింగ్.. ఫీల్డింగ్ వరకు కివీస్ ఆటగాళ్లు తమ సత్తా చాటుతున్నారు. సెమీ-ఫైనల్‌లో కేన్ విలియమ్సన్, రచిన్ రవీంద్ర సెంచరీలు సాధించారు. ఈ ఇద్దరు ఆటగాళ్లు ఇప్పుడు టీమ్ ఇండియా బౌలర్లకు సవాలుగా మారే అవకాశం ఉంది.