Site icon HashtagU Telugu

T20 World Cup Rules: టి20 ప్రపంచకప్ లో ఐపీఎల్ నియమాలు చెల్లవ్

T20 World Cup Rules

T20 World Cup Rules

T20 World Cup Rules: ఐపీఎల్ 17వ సీజన్ ముగిసింది. ఈ సీజన్లో ధనా ధన్ బ్యాటింగుతో కుర్రాళ్ళు హోరెత్తించారు. సిఎస్కె, ఏంఐ లాంటి బలమైన జట్లను ఇంటికి పంపించి కోల్కతా, సన్ రైజర్స్ ఫైనల్స్ కు చేరింది. అయితే టోర్నీ ఆరంభం నుంచి అద్భుత ప్రదర్శనతో రాణించిన ఎస్ఆర్ఎచ్ ఫైనల్లో చేతులెట్టేసింది. దేంతో పదేళ్ల నిరీక్షణ తర్వాత కోల్కతా టైటిల్ గెలుచుకుంది.

జూన్ 2 నుంచి టి20 ప్రపంచకప్ ప్రారంభం కానుంది. ఈ టోర్నీ కోసం క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈసారి టీ20 ప్రపంచకప్‌లో మొత్తం 20 జట్లు పాల్గొంటున్నాయి. అయితే ఐపీఎల్ లో ఉన్న నియమాలు T20 ప్రపంచ కప్ లో ఉండవు. 2023 ఐపీఎల్ లో ఇంపాక్ట్ ప్లేయర్ నియమం అమలైంది. ఈ నియమం ప్రకారం టాస్ సమయంలో కెప్టెన్ జట్టులోని 11 మందితో పాటు మరో ఐదుగురు ఆటగాళ్ల పేర్లను ఇవ్వాలి వారిని ఇంపాక్ట్ ప్లేయర్‌లుగా ఉపయోగించవచ్చు. ఈ సీజన్లో అన్ని జట్లు ఈ నియమాన్ని ఉపయోగించుకున్నాయి. చెన్నై సూపర్ కింగ్స్ శివమ్ దూబేని ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఉపయోగించుకుంది. ఈ నియామం కారణంగా చెన్నై చాలా మ్యాచ్‌లను గెలుచుకుంది.

టి20 ప్రపంచ కప్‌లో ఇంపాక్ట్ ప్లేయర్ నియమం ఉండదు. ఐపీఎల్ మ్యాచ్ మధ్యలో వైడ్ బాల్స్ మరియు నో బాల్స్ కోసం ఆటగాళ్ళు DRS తీసుకోవచ్చు కానీ టి20 ప్రపంచ కప్‌లో ఈ నియమం వర్తించదు. ప్లేయర్లు వైడ్ మరియు నో బాల్ కోసం DRS తీసుకోవడానికి వీలుండదు, అంపైర్ నిర్ణయం మాత్రమే అంతిమం.ఇది కాకుండా ఐపీఎల్ (IPL) మ్యాచ్‌ల సమయంలో బౌలర్లు ఒక ఓవర్‌లో రెండు బౌన్సర్‌లను వేయవచ్చు, కానీ T20 ప్రపంచ కప్‌లోఅది సాధ్యపడదు. టీ20 ప్రపంచకప్‌లో బౌలర్లు ఒక ఓవర్‌లో ఒక బౌన్సర్ మాత్రమే వేయడానికి పర్మిషన్ ఉంటుంది. ఐపీఎల్లో ఒక మ్యాచ్‌లో మొత్తం నాలుగు స్ట్రాటజిక్ టైమ్ అవుట్‌లు ఉంటాయి, కానీ T20 ప్రపంచ కప్‌లో స్ట్రాటజిక్ టైమ్ అవుట్‌ ఉండదు. పొట్టి ప్రపంచకప్ లో డ్రింక్స్ బ్రేక్‌లు మాత్రమే ఉంటాయి.

Also Read: Telangana : కాంగ్రెస్‌లో బీఆర్ఎస్ విలీనం – బీజేపీ ఎంపీ లక్ష్మణ్