బీసీసీఐ మాజీ చీఫ్ గంగూలీ (Ganguly), టీమిండియా మాజీ కెప్టెన్ కోహ్లీ (Virat Kohli) మధ్య విభేదాలు సమసిపోయినట్టు కనిపించడం లేదు. ఐపీఎల్ 2023 20వ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ జరిగింది. చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీ 23 పరుగుల తేడాతో ఢిల్లీని ఓడించింది. ఈ సీజన్‌లో ఢిల్లీకి ఇది వరుసగా ఐదో ఓటమి. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ కెప్టెన్ డేవిడ్ వార్నర్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 174 పరుగులు చేసింది. దీనికి సమాధానంగా ఢిల్లీ జట్టు 151 పరుగులకే ఆలౌటైంది.
ఆర్సీబీ తరఫున విరాట్ కోహ్లి 34 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించాడు. ఢిల్లీపై విరాట్ కోహ్లీ బ్యాట్‌తో అద్భుతాలు చేయడమే కాకుండా, ఫీల్డింగ్ సమయంలో కోహ్లీ రెండో ఇన్నింగ్స్‌లో మూడు అద్భుతమైన క్యాచ్‌లను కూడా అందుకున్నాడు. అయితే.. మ్యాచ్ ముగిసిన తర్వాత రెండు ప్రత్యర్థి జట్ల ఆటగాళ్లు, టీమ్ మేనేజ్‌మెంట్ ఒకరితో ఒకరు కరచాలనం ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా చర్చనీయాంశమైంది. నిజానికి మ్యాచ్ ముగిసిన తర్వాత విరాట్ కోహ్లీ, ఢిల్లీ క్యాపిటల్స్ క్రికెట్ డైరెక్టర్ సౌరవ్ గంగూలీతో కరచాలనం చేయలేదు. అంతేకాదు దాదాను కూడా కోహ్లీ పూర్తిగా పట్టించుకోలేదు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.
మ్యాచ్ ముగిసిన తర్వాత ఇరు జట్ల ఆటగాళ్లు, సిబ్బంది పరస్పరం కరచాలనం చేసుకుంటున్నసమయంలో గంగూలీ, కోహ్లీ తారసపడ్డారు. అయితే, గంగూలీతో చేతులు కలిపేందుకు కోహ్లీ ఇష్టపడలేదు. అది చూసిన పాంటింగ్ గంగూలీతో చేతులు కలపాలని కోహ్లీకి చెప్పినప్పటికీ మరోమారు నిరాకరించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Virat kohli Didn't shake hands with Ganguly… #RCBvDC pic.twitter.com/0jw8AjoGHW
— runmachinevirat (@runmachine117) April 15, 2023
ఫీల్డింగ్ సమయంలో RCB బౌలింగ్‌లో బౌండరీ లైన్ వద్ద అమన్‌ఖాన్‌కి క్యాచ్‌ని అందుకున్నప్పుడు కోహ్లీ ఉత్సాహం స్పష్టంగా కనిపించింది. క్యాచ్ తీసుకున్న తర్వాత అతను ఢిల్లీ క్యాపిటల్స్ డగౌట్‌లో కూర్చున్న హెడ్ కోచ్ రికీ పాంటింగ్, సౌరవ్ గంగూలీ వైపు చూస్తూ కనిపించాడు. ఈ ఘటన మళ్లీ కోహ్లి, గంగూలీల మధ్య ఉన్న పాత వివాదాన్ని బయటపెట్టిందని చర్చ జరుగుతుంది.
IPL 2021లో విరాట్ కోహ్లీ RCB, భారత T20 జట్టు కెప్టెన్సీని విడిచిపెట్టాడు. దీని తర్వాత వన్డే జట్టు కెప్టెన్సీకి కూడా గుడ్ బై చెప్పాడు. ఇది బీసీసీఐ నిర్ణయమని కోహ్లీ పేర్కొన్నాడు. ఆ సమయంలో సౌరవ్ గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్నారు. కెప్టెన్సీ విషయంపై గంగూలీ మాట్లాడుతూ.. ఈ నిర్ణయం గురించి విరాట్‌తో మాట్లాడానని, జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత నిర్ణయం తీసుకోవాలని సూచించానని చెప్పాడు. అయితే దక్షిణాఫ్రికా టూర్‌కు వెళ్లే ముందు విరాట్ కోహ్లి విలేకరుల సమావేశంలో దీన్ని ఖండించాడు. తనతో ఎవరూ మాట్లాడలేదని విరాట్ చెప్పాడు. దీని తర్వాత టెస్టుల నుంచి కూడా కెప్టెన్సీకి కోహ్లీ గుడ్ బై చెప్పాడు.