స‌న్‌రైజ‌ర్స్ ఆట‌గాళ్ల మ‌ధ్య గొడ‌వ‌.. అస‌లేం జ‌రిగింది?

ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి ముందు జట్లు ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్నాయి. మార్చి 21న జరిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్రాక్టీస్ మ్యాచ్‌లో అభిమానులు ఊహించని ఒక సంఘటన జరిగింది.

Published By: HashtagU Telugu Desk
SRH

SRH

SRH: ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి ముందు జట్లు ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్నాయి. మార్చి 21న జరిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్రాక్టీస్ మ్యాచ్‌లో అభిమానులు ఊహించని ఒక సంఘటన జరిగింది. SRH లెగ్ స్పిన్నర్ జీషాన్ అన్సారీ.. తన జట్టు కెప్టెన్ ఇషాన్ కిషన్‌ను అవుట్ చేసిన తర్వాత కాస్త అతిగా ప్రవర్తించారు. వికెట్ తీసిన ఆవేశంలో కెప్టెన్‌కు కోపంగా పెవిలియన్ దారి చూపించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అసలు ఏం జరిగింది?

ప్రాక్టీస్ కోసం SRH ఆటగాళ్లను రెండు జట్లుగా విభజించారు. రెండో ఇన్నింగ్స్‌లో 26 ఏళ్ల జీషాన్ అన్సారీ ఎనిమిదో ఓవర్ వేయడానికి వచ్చారు. అప్పటికే ఇషాన్ కిషన్ కేవలం 20 బంతుల్లో 52 పరుగులు చేసి మెరుపు దాడి చేస్తున్నారు. జీషాన్ వేసిన మొదటి నాలుగు బంతుల్లో కిషన్ రెండు సిక్సర్లు, రెండు ఫోర్లు బాదారు.

Also Read: New Rules: ఏప్రిల్ 1 నుంచి మారనున్న రూల్స్ !!

వరుస బాదుడుతో బౌలర్‌ను ఇబ్బంది పెట్టిన ఇషాన్.. ఐదో బంతికి మరో భారీ షాట్ కొట్టబోయి అవుట్ అయ్యారు. వికెట్ పడగానే జీషాన్ తన సహనాన్ని కోల్పోయి కెప్టెన్ ఇషాన్‌తో వాగ్వాదానికి దిగారు. కోపంతో కిషన్‌ను మైదానం బయటకు వెళ్ళమని సైగ చేశారు. అయితే టీ20 వరల్డ్ కప్ ఛాంపియన్ అయిన ఇషాన్ కిషన్ దీనిపై గొడవ పడకుండా నవ్వుతూ అక్కడి నుండి వెళ్ళిపోయారు.

SRH కెప్టెన్‌గా ఇషాన్ కిషన్

స్టార్ ప్లేయర్ ప్యాట్ కమిన్స్ గాయం కారణంగా IPL 2026 ప్రారంభ మ్యాచ్‌లకు దూరం కానున్నారు. దీంతో సన్‌రైజర్స్ మేనేజ్‌మెంట్ ఇషాన్ కిషన్‌ను కెప్టెన్‌గా ప్రకటించింది. కమిన్స్ తిరిగి వచ్చే వరకు ఇషానే జట్టును నడిపిస్తారు.

జీషాన్ అన్సారీ: గత సీజన్‌లో 10 మ్యాచ్‌ల్లో 6 వికెట్లు తీసిన జీషాన్.. ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్నాడు.

తొలి మ్యాచ్

IPL 2026లో SRH తన మొదటి మ్యాచ్‌ను మార్చి 28న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో RCBతో ఆడనుంది. మైదానంలో జీషాన్ చూపించిన ఈ అగ్రెసివ్ ఆటిట్యూడ్‌ను కెప్టెన్ ఇషాన్ కిషన్ కేవలం ఆటలో భాగంగానే తీసుకుంటారని, టోర్నీలో ఇదే ఫామ్ కొనసాగిస్తాడని జట్టు ఆశిస్తోంది.

  Last Updated: 22 Mar 2026, 02:38 PM IST