Rohit- Virat: కోహ్లీకి ఛాన్స్ ఉంది.. రోహిత్ కష్టమే: వసీం జాఫర్

టీమిండియా క్రికెటర్లు విరాట్ కోహ్లీ (Virat Kohli), రోహిత్ శర్మల (Rohit Sharma) టీ20 భవిష్యత్తుపై మాజీ క్రికెటర్ వసీం జాఫర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. వచ్చే టి20 ప్రపంచ కప్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ ఆడడని జోస్యం చెప్పాడు. విరాట్ కోహ్లీ ఈ ఐసిసి టోర్నమెంట్‌లో చివరిసారిగా ఆడవచ్చని చెప్పాడు.

Published By: HashtagU Telugu Desk
Rohit-Virat

Rohit-Virat

టీమిండియా క్రికెటర్లు విరాట్ కోహ్లీ (Virat Kohli), రోహిత్ శర్మల (Rohit Sharma) టీ20 భవిష్యత్తుపై మాజీ క్రికెటర్ వసీం జాఫర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. వచ్చే టి20 ప్రపంచ కప్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ ఆడడని జోస్యం చెప్పాడు. విరాట్ కోహ్లీ ఈ ఐసిసి టోర్నమెంట్‌లో చివరిసారిగా ఆడవచ్చని చెప్పాడు. రోహిత్ శర్మ నాయకత్వంలో భారత్ గత ఏడాది T20 ప్రపంచకప్ 2022 సెమీ-ఫైనల్ వరకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ టోర్నమెంట్‌లో కోహ్లీ అద్భుత ప్రదర్శన చేశాడు. అయితే ఇంగ్లండ్ చేతిలో 10 వికెట్ల పరాజయం తర్వాత T20 ప్రపంచ కప్ గెలవాలనే భారత్ కల నెరవేరలేదు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ, IPL, ODI ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని శ్రీలంక, న్యూజిలాండ్‌తో జరిగిన T20Iలకు కోహ్లీ, రోహిత్ ఇద్దరూ విశ్రాంతి తీసుకున్నారు.

Also Read: Prabhas Car Collection: ప్రభాస్ గ్యారేజ్.. ఇచ్చట అన్ని రకాల కార్లు ఉండబడును!

టీ20ల్లో యువకులే ఉంటారు. అందుకే వచ్చే వరల్డ్ కప్ లో రోహిత్ శర్మ భాగమవుతాడని నేను అనుకోవడం లేదు. కోహ్లీ ఆడితే ఆడొచ్చు. రోహిత్ మాత్రం కష్టమేనని మాజీ క్రికెటర్ వసీం జాఫర్ అన్నాడు. రోహిత్ శర్మ తదుపరి టీ20 ప్రపంచకప్‌లో ఆడడం నాకు కనిపించడం లేదు. విరాట్ కోహ్లీ ఆడవచ్చు. కానీ రోహిత్ శర్మ ఖచ్చితంగా తదుపరి ఎడిషన్ ఆడడు. ఇప్పటికే అతడికి 36 ఏళ్లు అనుకుంటా అని స్పష్టంగా చెప్పాడు. రాబోయే ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని రోహిత్ శర్మ, కోహ్లీలను టీ20 ఇంటర్నేషనల్‌లకు దూరంగా ఉంచడమే సెలక్టర్ల ప్రాధాన్యత అని వసీం జాఫర్ చెప్పాడు.

  Last Updated: 04 Feb 2023, 02:09 PM IST