Site icon HashtagU Telugu

Sehwag : టీం ఇండియా కాదు.. టీం భారత్.. జెర్సీలపై కూడా అలాగే మార్చాలంటూ సెహ్వాగ్ ట్వీట్..

Dismissed On 99

Dismissed On 99

ఇప్పుడు దేశమంతటా ఒకటే హాట్ టాపిక్ నడుస్తుంది. ఇండియా(India) పేరు భారత్(Bharat) అని మార్చాలంటూ చర్చ జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం పేరు మార్చడానికి చూస్తుంది. ఒకప్పుడు మన దేశం పేరు భారతదేశం అయినా ఆ తర్వాత బ్రిటిష్ సమయంలో ఇండియాగా మారింది. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ భారత్ పెట్టాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది.

దీనికి ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. తమ ఇండియా కూటమి వల్లే ఇలా అచేస్తున్నారంటూ కామెంట్స్ చేస్తున్నాయి.కానీ ప్రజల్లో, పలువురు ప్రముఖులు కూడా చాలా మంది మేరా భారత్ మహాన్ అంటూ సపోర్ట్ చేస్తూ కామెంట్స్ పెడుతున్నారు. నెటిజన్లు కూడా మేరా భారత్ అంటూ పోస్టులు చేస్తున్నారు. ఇక మాజీ టీమిండియా క్రికెటర్ సెహ్వాగ్(Sehwag) అయితే ట్విట్టర్ లో పొద్దున్నుంచి దీనిపైనే ట్వీట్స్ వేస్తున్నాడు.

సెహ్వాగ్ ట్విట్టర్ లో చాలా యాక్టివ్ గా ఉంటాడని తెలిసిందే. అన్ని అంశాలపై స్పందిస్తాడు. ఇప్పుడు దీనిపై కూడా స్పందిస్తూ భారత్ కి సపోర్ట్ గా ట్వీట్స్ చేస్తున్నాడు. అయితే ఇవాళ టీం ఇండియా(Team India) ప్రపంచకప్ జట్టు BCCI విడుదల చేసిన సంగతి తెలిసిందే.

దీనిపై సెహ్వాగ్ స్పందిస్తూ.. టీం ఇండియా కాదు టీం భారత్ అని రాయండి. ప్రపంచకప్‌లో కోహ్లి, రోహిత్, బుమ్రా, జడ్డూలను ఉత్సాహపరుస్తున్నప్పుడు, మన హృదయాల్లో భారత్ ఉండాలని కోరుకుంటున్నాను. ఆటగాళ్లు వేసుకునే జెర్సీపై కూడా భారత్ ఉండాలంటూ బీసీసీఐ, జైషాకు ట్వీట్ చేశాడు. దీంతో ఈ ట్వీట్ వైరల్ గా మారింది.

 

Also Read : World Cup 2023: ప్రపంచ కప్ లో రాహుల్ కి చోటు.. ఫ్యాన్స్ ఫైర్

Exit mobile version