Virat Kohli Record: ఢిల్లీ క్యాపిటల్స్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ కేఎల్ రాహుల్ తన టీ20 కెరీర్‌లో 8000 పరుగులు పూర్తి చేయడానికి కేవలం 33 పరుగుల దూరంలో ఉన్నాడు. ఈ ఘనత సాధిస్తే అతను విరాట్ కోహ్లీ రికార్డును (Virat Kohli Record) బద్దలు కొడతాడు. కేఎల్ రాహుల్ టీ20 క్రికెట్‌లో అత్యంత వేగంగా 8000 పరుగులు సాధించిన భారతీయ బ్యాట్స్‌మన్‌గా నిలుస్తాడు. రాహుల్ ఈ సీజన్‌లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఈరోజు ఢిల్లీ క్యాపిటల్స్- గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగే మ్యాచ్‌లో కూడా కేఎల్ గొప్ప ఇన్నింగ్స్ ఆడుతాడని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
అక్షర్ పటేల్ నాయకత్వంలోని ఢిల్లీ క్యాపిటల్స్ 11 మ్యాచ్‌లలో 6 విజయాలతో 13 పాయింట్లతో పాయింట్ల టేబుల్‌లో ఐదవ స్థానంలో ఉంది. ఒక మ్యాచ్ ఫలితం లేకుండా ముగిసింది. ప్లేఆఫ్‌కు చేరుకోవడానికి ఢిల్లీ మిగిలిన రెండు మ్యాచ్‌లలో విజయం సాధించాలి. ఒక్క మ్యాచ్‌లోనైనా ఓడిపోతే ప్లేఆఫ్ అవకాశాలు ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడి ఉంటుంది.
టీ20 క్రికెట్‌లో అత్యంత వేగంగా 8000 పరుగులు
ప్రస్తుత విరాట్ కోహ్లీ టీ20 క్రికెట్‌లో 257 మ్యాచ్‌లలో 243వ ఇన్నింగ్స్‌లో 8000 పరుగులు సాధించి అత్యంత వేగంగా ఈ మైలురాయి చేరుకున్న భారతీయ బ్యాట్స్‌మన్‌గా ప్రపంచంలో మూడవ స్థానంలో ఉన్నాడు. కేఎల్ రాహుల్ ఈ రోజు తన 237వ మ్యాచ్.. 224వ ఇన్నింగ్స్‌లో ఆడనున్నాడు. 7967 పరుగులతో 33 పరుగుల దూరంలో ఉన్నాడు. అతని ఖాతాలో 6 సెంచరీలు, 68 అర్ధ సెంచరీలు ఉన్నాయి.
Also Read: Indian Army: ఆపరేషన్ సిందూర్.. మరో వీడియో విడుదల చేసిన ఇండియన్ ఆర్మీ!
ఈ జాబితాలో అగ్రస్థానంలో వెస్టిండీస్ మాజీ బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్ ఉన్నాడు. అతను 217 మ్యాచ్‌లలో 213 ఇన్నింగ్స్‌లలో 8000 పరుగులు సాధించాడు. రెండవ స్థానంలో పాకిస్తాన్ బ్యాట్స్‌మన్ బాబర్ ఆజమ్ ఉన్నాడు. అతను 227 మ్యాచ్‌లలో 218 ఇన్నింగ్స్‌లలో ఈ ఘనత సాధించాడు.
IPL 2025లో కేఎల్ రాహుల్ ప్రదర్శన
మొదటి మ్యాచ్‌ను మిస్ అయిన కేఎల్ రాహుల్ ఈ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున 10 మ్యాచ్‌లలో 47.63 సగటుతో 381 పరుగులు చేశాడు. ఇందులో 3 అర్ధ సెంచరీలు ఉన్నాయి. 30 ఫోర్లు, 16 సిక్సర్లు బాదాడు. రాహుల్ తన అత్యధిక స్కోరు (93 నాటౌట్) ఏప్రిల్ 10న బెంగళూరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)పై సాధించాడు. రెండు అర్ధ సెంచరీలు చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్‌పై వచ్చాయి. గతంలో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాహుల్ 28 పరుగులు చేశాడు.