Virat Kohli: అత్యుత్తమ ఫీల్డర్ అవార్డు కోహ్లీకే..

ప్రపంచ కప్ లో టీమిండియా అద్భుత ప్రదర్శనచేసింది. సెమీ-ఫైనల్ వరకు మొత్తం 10 మ్యాచ్‌లు గెలిచిన టీమ్ ఇండియా పాయింట్ల పట్టికలో అజేయంగా నిలిచి ఫైనల్స్‌కు చేరింది.

Virat Kohli: ప్రపంచ కప్ లో టీమిండియా అద్భుత ప్రదర్శన చేసింది. సెమీ-ఫైనల్ వరకు మొత్తం 10 మ్యాచ్‌లు గెలిచిన టీమ్ ఇండియా పాయింట్ల పట్టికలో అజేయంగా నిలిచి ఫైనల్స్‌కు చేరింది. అయితే టైటిల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై భారత్ ఓటమి పాలైంది. నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరిగిన ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో టీమ్ ఇండియాను ఓడించింది. సొంతగడ్డపై ఓటమిని టీమిండియా ఆటగాళ్లు జీర్ణించుకోలేకపోయారు. కోహ్లీ, రోహిత్, సిరాజ్ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఓటమి తర్వాత డ్రెస్సింగ్ రూమ్‌ వాతావరణం ఉద్వేగభరితంగా కనిపించింది. అదే సమయంలో డ్రెస్సింగ్ రూమ్‌లో ఉత్తమ ఫీల్డర్ అవార్డు విజేతను ప్రకటించారు.

ఫైనల్ మ్యాచ్ తర్వాత విరాట్ కోహ్లీ అత్యుత్తమ ఫీల్డర్ అవార్డును అందుకున్నాడు. ఫీల్డింగ్ కోచ్ టి దిలీప్ విరాట్ కోహ్లీకి ఉత్తమ ఫీల్డర్ అవార్డును అందించారు . ప్రతి మ్యాచ్ తర్వాత డ్రెస్సింగ్ రూమ్‌లో జరిగే వేడుకలో ఆటగాళ్లలో చాలా ఉత్సాహభరితమైన వాతావరణం ఉండేది. అయితే ఫైనల్లో ఓటమి కారణంగా డ్రెస్సింగ్ రూమ్‌లో నిశ్శబ్దం కనిపించింది. అప్పుడు ఫీల్డింగ్ కోచ్ టి దిలీప్ ఆటగాళ్లలో ఉత్సాహం నింపే ప్రయత్నం చేశాడు. నిరుత్సాహపడొద్దని, ఓటమి, గెలుపు సహజమని ఆటగాళ్లలో ఉత్సాహం నింపాడు. ఇక అత్యుత్తమ ఫీల్డర్ అవార్డు అందుకున్న కింగ్ కోహ్లీకి సహచర ఆటగాళ్లంతా అతడికి శుభాకాంక్షలు తెలిపారు. జడేజా కింగ్ కోహ్లీ మెడలో పతకాన్నిఆవిష్కరించాడు. ప్రస్తుతం దీనికి సంబందించిన వీడియోని నెటిజన్స్ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

Also Read: Telangana Elections 2023 : తెలంగాణలో ప్రారంభమైన పోలింగ్..