Site icon HashtagU Telugu

Highest Tax-Paying Cricketers : అత్యధిక ట్యాక్స్ కట్టిన క్రికెటర్ల లిస్ట్… టాప్ ప్లేస్ లో ఉన్నది ఎవరంటే ?

Highest Tax Paying Crickete

Highest Tax Paying Crickete

భారత్ లో క్రికెటర్లకు (Cricketers ), సినిమా స్టార్లకు (Movie Actors) ఉండే క్రేజ్ , ఆదాయం మరెవరికీ ఉండదు. ముఖ్యంగా టీమిండియా (Team India)లో ఒక్కసారి చోటు దక్కి సక్సెస్ అయితే ఇక ఆదాయం కోట్లలో ఉంటుంది. ఒకవైపు బీసీసీఐ (BCCI) ఇచ్చే మ్యాచ్ ఫీజు, కాంట్రాక్ట్ ఫీజులు, ఐపీఎల్ ద్వారా వచ్చే డబ్బుతో పాటు వాణిజ్య ఒప్పందాలతో మరిన్ని కోట్లు ఆర్జిస్తుంటారు. అదే స్థాయిలో ట్యాక్స్ కూడా కడుతుంటారు. తాజాగా 2024 ఏడాదికి సంబంధించి అత్యధిక టాక్స్ కట్టిన క్రికెటర్ల (Highest Tax-paying cricketers) జాబితా వెల్లడైంది. స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) ఈ జాబితాలో టాప్ ప్లేస్ సాధించాడు. కోహ్లీ 60 కోట్లు పన్నుగా చెల్లిస్తే… ధోనీ 38 కోట్లు, సచిన్ 28 కోట్లు పన్ను కట్టారు. మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ 23 కోట్లు, హార్థిక్ పాండ్యా 13 కోట్లు, రిషబ్ పంత్ 10 కోట్లు పన్ను చెల్లించారు. అయితే టాప్ ట్వంటీలో రోహిత్ శర్మ పేరు లేకపోవడం ఆశ్చర్యపరిచింది.

We’re now on WhatsApp. Click to Join.

ఓవరాల్ గా దేశంలో అత్యధిక ట్యాక్స్ చెల్లించిన సెలబ్రిటీల జాబితాలో బాలీవుడ్ స్టార్సే ఉన్నారు. బాలీవుడ్ బాద్ షారూఖ్ ఖాన్ 92 కోట్లు కట్టగా.. తమిళ సూపర్ స్టార్ విజయ్ 82 కోట్లు, సల్మాన్ ఖాన్ 75 కోట్లు, అమితాబ్ 71 కోట్లు చెల్లించారు. ఓవరాల్ సెలబ్రిటీ జాబితాలో టాప్ టెన్ లో ముగ్గురు క్రికెటర్లు ఉన్నారు. కోహ్లీ ఐదో స్థానంలోనూ, ధోనీ ఏడో స్థానంలోనూ , సచిన్ తొమ్మిదో ప్లేస్ లోనూ నిలిచారు. అత్యధిక పన్ను చెల్లించిన టాప్ 20 జాబితాలో హీరోయిన్లు కరీనా కపూర్, కియారా అద్వానీ, కత్రినా కైఫ్ ఉన్నారు.

అత్యధిక పన్ను కట్టిన క్రికెటర్లు (Highest Tax-Paying Cricketers) టాప్ 5 :

విరాట్ కోహ్లీ – రూ. 66 కోట్లు
ఎంఎస్ ధోనీ – రూ. 38 కోట్లు
సచిన్ టెండూల్కర్ – రూ.28 కోట్లు
సౌరవ్ గంగూలీ – రూ. 23 కోట్లు
హార్థిక్ పాండ్యా – రూ. 13 కోట్లు
రిషబ్ పంత్ – రూ. 10 కోట్లు

Read Also : Floods in AP & TG : అగ్ర హీరోయిన్లు..అనన్యను చూసి బాధ్యత తెచ్చుకోండి