Virat Kohli: టీమ్ ఇండియా దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లీ తన భార్య అనుష్క శర్మతో కలిసి కొద్దిరోజుల క్రితమే భారత్‌కు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక్కడ ఆయన విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో ఆడుతూ కనిపించారు. అలాగే బృందావనంలో ప్రేమానంద్ మహరాజ్‌ను కూడా దర్శించుకున్నారు. ఆ తర్వాత ఈ జంట ముంబైలో కనిపించింది. అయితే కొత్త ఏడాది (న్యూ ఇయర్) వేడుకలను ఈ జంట ఎక్కడ జరుపుకోబోతున్నారనేది అభిమానుల్లో ఆసక్తిగా మారింది. తాజాగా వైరల్ అవుతున్న ఒక ఫోటోతో ఆ ప్రశ్నకు సమాధానం దొరికింది.
దుబాయ్‌లో విరాట్ కోహ్లీ!
సోషల్ మీడియాలో విరాట్ కోహ్లీకి సంబంధించిన ఒక ఫోటో నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. ఇందులో కోహ్లీ తన భార్య అనుష్క శర్మ, కొంతమంది స్నేహితులతో కలిసి దుబాయ్‌లో కనిపిస్తున్నారు. దీనిని బట్టి ఈ స్టార్ కపుల్ తమ న్యూ ఇయర్ వేడుకలను దుబాయ్‌లోనే జరుపుకోనున్నారని తెలుస్తోంది.
Also Read: నూతన విద్యా విధానంలో టి-సాట్ భాగస్వామ్యం.. మంత్రిని కోరిన సీఈవో వేణుగోపాల్ రెడ్డి
తిరిగొచ్చాక బిజీ షెడ్యూల్
న్యూ ఇయర్ వేడుకల అనంతరం కోహ్లీ తిరిగి భారత్‌కు చేరుకోనున్నారు. క్రిక్‌బజ్ నివేదిక ప్రకారం.. జనవరి 6న ఢిల్లీ తరపున విజయ్ హజారే ట్రోఫీలో కోహ్లీ బరిలోకి దిగుతారు. జనవరి 7న న్యూజిలాండ్‌తో జరగనున్న వన్డే సిరీస్ కోసం టీమ్ ఇండియాతో కలుస్తారు. విజయ్ హజారే ట్రోఫీలో రాణించి, అదే ఫామ్‌తో జాతీయ జట్టులో చేరాలని కింగ్ కోహ్లీ భావిస్తున్నారు.
ఫామ్‌ను కొనసాగించాలని పట్టుదల
జనవరి 11 నుంచి న్యూజిలాండ్‌తో టీమ్ ఇండియా మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. జూన్ నెల వరకు భారత జట్టు కేవలం మూడు వన్డేలు మాత్రమే ఆడనుండటంతో కోహ్లీకి ఈ సిరీస్ అత్యంత కీలకం కానుంది. ఈ సిరీస్ ముగిసిన తర్వాత కోహ్లీ నేరుగా ఐపీఎల్ 2026లో కనిపిస్తారు. వన్డే సిరీస్ అనంతరం కోహ్లీ మళ్లీ అనుష్కతో కలిసి లండన్ వెళ్లే అవకాశం ఉంది. కాగా 2026 సంవత్సరంలో టీమ్ ఇండియా మొత్తం 18 వన్డే మ్యాచ్‌లు ఆడే అవకాశం ఉంది.
