Virat Kohli Scripts History: భారత జట్టు స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లి (Virat Kohli Scripts History) ఇప్పుడు ప్రతి మ్యాచ్‌లోనూ తన పేరిట ఏదో ఒక పెద్ద రికార్డును నమోదు చేసుకున్నాడు. పాకిస్థాన్‌పై సెంచరీ చేసి ఎన్నో భారీ రికార్డులు సృష్టించిన కింగ్ కోహ్లి.. ఇప్పుడు న్యూజిలాండ్‌పై కూడా చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో కోహ్లి కేవలం 11 పరుగులే చేసినా.. అతని పేరిట ఓ పెద్ద రికార్డు నమోదైంది. ఈ రికార్డు సృష్టించిన తొలి ఆటగాడిగా కోహ్లీ నిలిచాడు.
విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు
న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో విరాట్ కోహ్లీపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ మ్యాచ్‌లో కోహ్లి 11 పరుగులు మాత్రమే చేసి మ్యాట్ హెన్రీకి బలయ్యాడు. గ్లెన్ ఫిలిప్స్ సూపర్ మ్యాన్ లాగా గాలిలో ఎగురుతూ క్యాచ్ పట్టుకుని కోహ్లీకి పెవిలియన్ దారి చూపించాడు. ఈ మ్యాచ్‌లో కోహ్లీ మైదానంలోకి అడుగుపెట్టిన వెంటనే 300 వన్డేలు పూర్తి చేసుకున్నాడు.
300 వన్డే మ్యాచ్‌లు ఆడిన 7వ భారత ఆటగాడిగా కోహ్లీ నిలిచాడు. దీంతో వన్డే ఫార్మాట్‌లో 300, టీ20 ఫార్మాట్‌లో 100, టెస్టుల్లో 100కు పైగా మ్యాచ్‌లు ఆడిన ప్రపంచంలోనే తొలి బ్యాట్స్‌మెన్‌గా విరాట్ కోహ్లీ నిలిచాడు. కోహ్లీ T20I ఫార్మాట్ నుండి రిటైర్మెంట్ తీసుకున్నాడు. కానీ ODIలు. టెస్టుల్లో ఆడుతున్నాడు.
Also Read: Deputy CM Bhatti: ఆయన రాజకీయం ఓ పాఠ్యాంశం.. డిప్యూటీ సీఎం భట్టి
అంతర్జాతీయ క్రికెట్‌లో కోహ్లీకి తిరుగులేని రికార్డులు
కింగ్ కోహ్లి ఇప్పటి వరకు టీమిండియా తరపున 300 వన్డేలు, 123 టెస్టులు, 125 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో అతను మొత్తం 27503 పరుగులు చేశాడు. ఇందులో 82 సెంచరీలు, 142 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఐసీసీ ఈవెంట్లలో కూడా విరాట్ కోహ్లీ టీమ్ ఇండియా తరుపున అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సెమీ ఫైనల్ మ్యాచ్‌ని మార్చి 4న టీమిండియా ఆడనుంది. కింగ్ కోహ్లి ఈ మ్యాచ్‌లో భారీ ఇన్నింగ్స్ ఆడాలని అభిమానులు ఆశిస్తున్నారు.