world cup 2023: ఈడెన్ గార్డెన్స్ లో విరాట్ సరికొత్త చరిత్ర… ఫాన్స్ కు కోహ్లీ బర్త్ డే గిఫ్ట్

అభిమానుల నిరీక్షణకు తెరపడింది...సమకాలీన క్రికెట్ లో టీమిండియా రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ వన్డేల్లో 49వ సెంచరీ అందుకున్నాడు. ఈడెన్ గార్డెన్స్ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్ లో కోహ్లీ తన 35వ పుట్టిన రోజున శతకంతో దుమ్ము రేపాడు.

world cup 2023: అభిమానుల నిరీక్షణకు తెరపడింది…సమకాలీన క్రికెట్ లో టీమిండియా రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ వన్డేల్లో 49వ సెంచరీ అందుకున్నాడు. ఈడెన్ గార్డెన్స్ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్ లో కోహ్లీ తన 35వ పుట్టిన రోజున శతకంతో దుమ్ము రేపాడు. గత మ్యాచ్ లో సెంచరీ చేజార్చుకున్న విరాట్ సఫారీ టీమ్ పై మాత్రం అదరగొట్టాడు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచీ నిలకడగా ఆడుతూ తనదైన షాట్లతో ఫాన్స్ ను అలరించాడు. 119 బంతుల్లో కోహ్లీ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. తద్వారా వన్డే క్రికెట్ లో దిగ్గజ ఆటగాడు సచిన్ పేరిట ఉన్న అత్యధిక శతకాల రికార్డును సమం చేశాడు. సచిన్ 452 ఇన్నింగ్స్ ల్లో ఈ ఘనత సాధిస్తే…కోహ్లీ 277 ఇన్నింగ్స్ లలోనే అందుకున్నాడు. అలాగే బర్త్ డే రోజున శతకం సాధించిన కాంబ్లీ , సచిన్ సరసన నిలిచాడు. కాగా ప్రపంచ కప్ లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లోనే సెంచరీ చేయాల్సిఉండగా, 88 పరుగుల వద్ద అవుటయ్యాడు.

ప్రస్తుత ప్రపంచ కప్ కు ముందు కోహ్లీ 47 సెంచరీలు చేశాడు. ఆస్ట్రేలియాపై 85 పరుగులు చేసి అవుటైనా, బంగ్లాదేశ్ తో జరిగిన పోటీలో సెంచరీ చేసి, సచిన్ రికార్డుకు చేరువగా వచ్చాడు. తాజా మ్యాచ్ లో సెంచరీ సాధించి, సచిన్ రికార్డును సమం చేశాడు. ఇదిలా ఉంటే కోహ్లీ ఇంకో సెంచరీ చేస్తే.. శతకాల హాఫ్ సెంచరీని అందుకుంటాడు. కోహ్లీ ఫామ్‌ని చూస్తుంటే.. ఈ ప్రపంచకప్‌లోనే ఆ రికార్డు బ్రేక్ చేసే అవకాశముంది. ఇప్పటివరకు విరాట్ 454 రన్స్ చేశాడు. ప్రస్తుతం కోహ్లీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈసారి టీమిండియాకు ప్రపంచకప్‌ అందిస్తాడని ఫాన్స్ ఆశగా ఎదురుచూస్తున్నారు.

Also Read: world cup 2023: కోహ్లీ, అయ్యర్ విధ్వంసం..