2027 World Cup: 2027 వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్‌కు రోహిత్‌, కోహ్లీ జ‌ట్టులో ఉంటారా? క్లారిటీ ఇదే!

భారత్- దక్షిణాఫ్రికా మధ్య 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్ నవంబర్ 30 నుండి ప్రారంభం కానుంది. రాంచీలో జరగనున్న ఈ వన్డే మ్యాచ్ కోసం టీమ్ ఇండియా సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి.

Published By: HashtagU Telugu Desk
Year Ender 2025

Year Ender 2025

2027 World Cup: భారత్- దక్షిణాఫ్రికా మధ్య 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్ నవంబర్ 30 నుండి ప్రారంభం కానుంది. రాంచీలో జరగనున్న ఈ వన్డే మ్యాచ్ కోసం టీమ్ ఇండియా సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి. ఈ సిరీస్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కూడా ఆడనున్నారు. ఈ నేపథ్యంలో 2027 ప్రపంచ కప్‌లో (2027 World Cup) రోహిత్-విరాట్ ఆడటంపై దక్షిణాఫ్రికా బౌలింగ్ కోచ్ మోర్నే మోర్కెల్ ఒక పెద్ద ప్రకటన చేశారు.

రోహిత్-విరాట్‌లపై కోచ్ ప్రకటన

టీమ్ ఇండియా బౌలింగ్ కోచ్ మోర్నే మోర్కెల్.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ 2027 ప్రపంచ కప్‌లో ఆడటం గురించి మాట్లాడుతూ.. అనుభవం ఎక్కడా దొరకదని నేను ఎప్పుడూ చెప్తుంటాను. వారు ట్రోఫీలు గెలిచారు. పెద్ద టోర్నమెంట్లు ఆడారు. వారు మానసికంగా, శారీరకంగా సిద్ధంగా ఉంటే 2027 ప్రపంచ కప్ ఏమంత దూరం కాదు అని పేర్కొన్నారు.

Also Read: Messi: హైద‌రాబాద్‌కు లియోనెల్ మెస్సీ.. ఎప్పుడంటే?!

టెస్ట్ సిరీస్ ఓటమిపై మోర్కెల్ వ్యాఖ్యలు

టెస్ట్ సిరీస్‌లో ఎదురైన ఓటమిని మరిచిపోవాలని మోర్నే మోర్కెల్ అన్నారు. ఆయన మాట్లాడుతూ.. గత రెండు వారాలు మాకు నిరాశను మిగిల్చాయి. కానీ ఇప్పుడు విషయాలను సమీక్షించుకోవడానికి మాకు కొన్ని రోజులు దొరికాయి. ఇప్పుడు మనం చేయాల్సిన ముఖ్యమైన పని ఏమిటంటే మన పూర్తి శక్తిని వైట్-బాల్ జట్టుపై పెట్టాలి. గత కొన్ని సంవత్సరాలుగా మేము వైట్-బాల్ క్రికెట్‌లో బాగా ఆడుతున్నాము. రాబోయే వారాల కోసం నేను ఉత్సాహంగా ఉన్నాను. ఫార్మాట్ ఏదైనా.. భారత్‌కు ప్రాతినిధ్యం వహించడం ముఖ్యమ‌ని తెలిపాడు. భారత్- దక్షిణాఫ్రికా మధ్య జరిగిన 2 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో టీమ్ ఇండియా పేలవమైన ప్రదర్శన కనబరిచిన సంగతి తెలిసిందే. ఆ సిరీస్‌లో జట్టు 2-0 తేడాతో ఓటమిని చవిచూసింది.

రోహిత్-విరాట్‌ల టెస్ట్ రిటైర్మెంట్‌

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఈ ఏడాది ఐపీఎల్ 2025 సందర్భంగా ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నారు. అదేంటంటే, టెస్ట్ క్రికెట్ నుండి రిటైర్‌మెంట్ ప్రకటించడం. ఇంగ్లాండ్‌ పర్యటనకు ముందు ఈ ఇద్దరు ఆటగాళ్లు అకస్మాత్తుగా రిటైర్‌మెంట్ ప్రకటించడం అభిమానులకు ఆశ్చర్యాన్ని కలిగించింది.

  Last Updated: 29 Nov 2025, 12:04 AM IST