Site icon HashtagU Telugu

Virat Kohli- Rohit Sharma: విరాట్ కోహ్లీ, రోహిత్ శ‌ర్మ‌ల‌కు బిగ్ షాక్‌!

Virat Kohli- Rohit Sharma

Virat Kohli- Rohit Sharma

Virat Kohli- Rohit Sharma: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) బుధవారం సౌత్ ఆఫ్రికా-ఎ జట్టుతో జరగనున్న మూడు అనధికారిక వన్డే మ్యాచ్‌ల సిరీస్‌కు ఇండియా-ఎ జట్టును ప్రకటించింది. అయితే ఇటీవల ఆస్ట్రేలియాపై మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో ఆడిన భారత దిగ్గజ బ్యాట్స్‌మెన్‌లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకు (Virat Kohli- Rohit Sharma) ఈ జట్టులో చోటు దక్కలేదు. భారత్, సౌత్ ఆఫ్రికా సీనియర్ జట్ల మధ్య నవంబర్ 30 నుండి మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ జరగనుంది. అంతకుముందు రెండు దేశాల ‘ఎ’ జట్ల మధ్య నవంబర్ 13 నుండి మూడు అనధికారిక వన్డే మ్యాచ్‌ల సిరీస్ ప్రారంభం కానుంది.

రోహిత్-కోహ్లీకి దక్కని చోటు

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఈ ‘ఇండియా-ఎ’ సిరీస్‌లో ఆడతారని తొలుత భావించినప్పటికీ.. బీసీసీఐ ప్రకటించిన జట్టులో ఈ ఇద్దరు దిగ్గజాల పేర్లు లేకపోవడం గమనార్హం. దీనితో ఈ సిరీస్‌లో వారు ఆడటం లేదు అని స్పష్టమైంది. అయితే సౌత్ ఆఫ్రికా సీనియర్ జట్టుతో జరగనున్న ప్రధాన వన్డే సిరీస్‌లో వీరిద్దరూ తిరిగి జట్టులోకి వచ్చే అవకాశం ఉంది.

Also Read: Best Laptops: రూ. 30 వేలు ఉంటే.. ఈ ల్యాప్‌టాప్‌లు మీ సొంతం!

తిలక్ వర్మకు కెప్టెన్సీ

ఈ అనధికారిక వన్డే సిరీస్‌లో తిలక్ వర్మ ఇండియా-ఎ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనుండగా, రుతురాజ్ గైక్వాడ్‌కు ఉప-కెప్టెన్ బాధ్యతలు అప్పగించారు. వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ ఇషాన్ కిషన్ చాలా కాలం తర్వాత భారత జట్టులో (ఇండియా-ఎ) తిరిగి చోటు దక్కించుకున్నాడు. ఈ జట్టులో అభిషేక్ శర్మ, రియాన్ పరాగ్, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, విప్రజ్ నిగమ్ వంటి యువ ఆటగాళ్లను తీసుకున్నారు. బౌలర్ల విషయానికి వస్తే హర్షిత్ రాణా, ప్రసిద్ధ్ కృష్ణ, అర్ష్‌దీప్ సింగ్‌లకు జట్టులో స్థానం లభించింది.

సౌత్ ఆఫ్రికా-ఎతో వన్డే సిరీస్ కోసం ఇండియా-ఎ జట్టు

Exit mobile version