Virat Kohli: రికార్డుల్లో కోహ్లీని కొట్టేవాడు లేడు

పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ రికార్డుల రారాజని ఊరికే అనలేదు. మూడు ఫార్మెట్లో ఎన్నో చిరస్మరణీయ మ్యాచ్ ల్లో రికార్డులను బద్దలు కొట్టాడు.

Virat Kohli: పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ రికార్డుల రారాజని ఊరికే అనలేదు. మూడు ఫార్మెట్లో ఎన్నో చిరస్మరణీయ మ్యాచ్ ల్లో రికార్డులను బద్దలు కొట్టాడు. ఆసియా కప్ వన్డే ఫార్మాట్ లో విరాట్ కోహ్లీ 4 మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ లు అందుకున్నాడు. ఆసియా కప్ వన్డే ఫార్మెట్లో ఎక్కువ సార్లు మ్యాచ్ ఆఫ్ ద మ్యాచ్ అవార్థులు అందుకున్న భారత్ ఆటగాడిగా కోహ్లీ నిలిచాడు. ఆసియా కప్ లో చిన తాలా సురేష్ రైనా మూడు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులను అందుకున్నాడు. క్రికెటర్ సిద్దు కూడా 3 సార్లు ఈ అవార్డును అందుకున్న జాబితాలో నిలిచాడు.

వన్డే క్రికెట్ లో తక్కువ ఇన్నింగ్స్ లో 13వేల పరుగులు పూర్తి చేసుకున్ మొదటి బ్యాట్స్ మన్ గా కోహ్లీ రికార్డ్ బద్దలు కొట్టాడు.సచిన్ 321 ఇన్నింగ్స్ లలో 13 వేల పరుగులు చేశాడు. ఇక కోహ్లీ వన్డేల్లో మొత్తం 47 సెంచరీలు బాదాడు. కోహ్లీ ఎప్పటికైనా సచిన్ రికార్డులను అధిగమిస్తాడని మాజీలు అభిప్రాయపడుతున్నారు.ప్రస్తుతం కోహ్లీ భీకర ఫామ్ లో ఉన్నాడు. మొన్న పాకిస్థాన్ మీద భారీ సెంచరీ నమోదు చేసి తానేంటో మరోసారి రుజువుచేశాడు. ప్రస్తుతం టీమిండియా ఆసియా కప్ లో ఫైనల్ బెర్త్ సాధించింది. ఆ తర్వాత ఆస్ట్రేలియాతో సిరీస్ ఆడనుంది. కాగా అక్టోబర్ 5 నుంచి ప్రపంచ కప్ మొదలుకాబోతుంది.

Also Read: I Am With CBN : గచ్చిబౌలి విప్రో సర్కిల్ వ‌ద్ద ఉద్రిక్త‌త‌.. చంద్ర‌బాబుకు మ‌ద్ధ‌తుగా భారీగా త‌ర‌లివ‌చ్చిన టెక్కీలు