Kohli IPL Wickets: ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన బ్యాట్స్‌మెన్లలో కోహ్లీ టాప్ 5లో ఉంటాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (rcb) తరుపున ఆడుతూ కోహ్లీ ఎన్నో పెద్ద రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. అయితే విరాట్ బౌలింగ్ రికార్డుల గురించి చాలా తక్కువ మందికి తెలిసి ఉంటుంది. కోహ్లీ అద్భుత బ్యాటింగ్ తో పాటు ఐపీఎల్ లో 2 జట్లపై వికెట్లు కూడా తీశాడు. వాస్తవానికి విరాట్ కోహ్లీ బ్యాటింగ్ రికార్డులు ఎప్పుడూ చర్చనీయాంశం అవుతాయి. కానీ ఐపీఎల్‌లో కోహ్లీ తీసిన వికెట్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
2008లో ఐపీఎల్ తొలి సీజన్‌లో కోహ్లీ (virat kohli) ఆర్సీబీ తరఫున రెండు పరుగులు చేసి రెండు వికెట్లు (wickets) పడగొట్టాడు. డెక్కన్ ఛార్జర్స్‌పై ఈ వికెట్లు నమోదయ్యాయి. 3.4 ఓవర్లలో 25 పరుగులిచ్చి 2 వికెట్లు తీసి ఔరా అనిపించాడు. 2011 ఐపీఎల్ సీజన్లో రెండు వేర్వేరు జట్లపై విరాట్ కోహ్లీ ఒక్కో వికెట్ తీశాడు. చెన్నైపై ఒక వికెట్, కొచ్చి టస్కర్స్ కేరళపై ఒక వికెట్ తీశాడు. ఈ విషయాలు చాలా తక్కువగా ప్రచారం అయినప్పటికీ కోహ్లీ రికార్డుల పర్వం కొనసాగుతూనే ఉంది. ఇకపోతే విరాట్ కోహ్లీ 2008 నుండి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఆడుతున్నాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్ కూడా కింగే. కోహ్లీ ఐపీఎల్ లో 131.97 స్ట్రైక్ రేట్ మరియు 38.67 సగటుతో 8004 పరుగులు చేశాడు. ఐపీఎల్‌లో 8000 పరుగులు చేసిన మొదటి మరియు ఏకైక బ్యాట్స్‌మెన్ విరాటే. ఈ కాలంలో విరాట్ 8 సెంచరీలు, 55 హాఫ్ సెంచరీలు చేశాడు. ఐపీఎల్ చరిత్రలో విరాట్ ఒకసారి కాదు రెండుసార్లు ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్నాడు. 2016లో ఆరెంజ్ క్యాప్‌ను గెలుచుకున్నాడు. చివరి సీజన్ 2024లో కూడా అతను ఆరెంజ్ క్యాప్‌ను గెలుచుకున్నాడు.
Also Read: Sai Sudharsan: టీమిండియాకు త్వరలో మరో లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్