హిస్టరీ క్రియేట్ చేసిన కింగ్ కోహ్లీ!

వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో 20 పరుగులు చేయగానే కోహ్లీ ఈ ఘనతను సొంతం చేసుకున్నాడు. ఈ క్రమంలో కె.ఎల్. రాహుల్, శిఖర్ ధావన్‌లను వెనక్కి నెట్టాడు.

Published By: HashtagU Telugu Desk
Virat Kohli

Virat Kohli

Virat Kohli Record: విరాట్ కోహ్లీ ఎప్పటిలాగే ఐపీఎల్ 2026లో కూడా రికార్డుల పరంపరను కొనసాగిస్తున్నాడు. తాజాగా ముంబై ఇండియన్స్‌పై సరికొత్త చరిత్ర సృష్టించాడు. ముంబై ఇండియన్స్‌పై 1000 పరుగుల మైలురాయిని అందుకున్న ప్రపంచంలోనే తొలి క్రికెటర్‌గా కోహ్లీ నిలిచాడు. ఛాంపియన్స్ లీగ్ టీ20, ఇండియన్ ప్రీమియర్ లీగ్ రెండింటినీ కలిపి ముంబైపై కోహ్లీ ఈ వెయ్యి పరుగుల మార్కును పూర్తి చేశాడు.

ఆదివారం వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో 20 పరుగులు చేయగానే కోహ్లీ ఈ ఘనతను సొంతం చేసుకున్నాడు. ఈ క్రమంలో కె.ఎల్. రాహుల్, శిఖర్ ధావన్‌లను వెనక్కి నెట్టాడు. ఈ జాబితాలో ఏబీ డివిలియర్స్, డేవిడ్ వార్నర్ కూడా కోహ్లీకి చేరువలోనే ఉన్నారు. ఒకే జట్టు (RCB) తరపున ఆడుతూ ఒక నిర్దిష్ట జట్టుపై వెయ్యి పరుగులు పూర్తి చేయడం కోహ్లీ రికార్డును మరింత ప్రత్యేకం చేస్తోంది. కాగా ముంబైపై వెయ్యి పరుగులు పూర్తి చేయడానికి కె.ఎల్. రాహుల్ ఇంకా 23 పరుగుల దూరంలో ఉన్నాడు.

Also Read: వాంఖడే స్టేడియంలో చ‌రిత్ర సృష్టించిన ఆర్సీబీ!

టీ20ల్లో ముంబై ఇండియన్స్‌పై అత్యధిక పరుగులు

  1. 1000+ పరుగులు – విరాట్ కోహ్లీ
  2. 977 పరుగులు – కె.ఎల్. రాహుల్
  3. 888 పరుగులు – అజింక్య రహానే
  4. 850 పరుగులు – సురేష్ రైనా
  5. 829 పరుగులు – ఎం.ఎస్. ధోనీ

4 జట్లపై 1000 పరుగులు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో విరాట్ కోహ్లీ నాలుగు వేర్వేరు జట్లపై వెయ్యికి పైగా పరుగులు సాధించాడు. చెన్నై సూపర్ కింగ్స్‌పై 1174 పరుగులు, పంజాబ్ కింగ్స్‌పై 1159 పరుగులు చేశాడు. వీటితో పాటు కోల్‌కతా నైట్ రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్‌పై కూడా వెయ్యికి పైగా పరుగులు పూర్తి చేశాడు.

ఆదివారం నాటి మ్యాచ్‌కు ముందు వరకు విరాట్ కోహ్లీ ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌పై 922 పరుగులు చేశాడు. కేవలం ఐపీఎల్‌లో మాత్రమే ముంబైపై వెయ్యి పరుగులు పూర్తి చేయడానికి ఇంకా 78 పరుగులు అవసరం. కాగా ఐపీఎల్ చరిత్రలో 8 వేల కంటే ఎక్కువ పరుగులు చేసిన ఏకైక బ్యాటర్‌గా విరాట్ కోహ్లీ రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే.

  Last Updated: 12 Apr 2026, 11:20 PM IST