Delhi, Ranji Trophy, Virat Kohli Clean Bowled, Domestic Cricket, Sports News, Cricket News
Virat Kohli Clean Bowled: పేలవ ఫామ్ లో ఉన్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ దేశవాళీ క్రికెట్ ఆడుతున్నారు. ఢిల్లీకి రంజీ ట్రోఫీ ఆడేందుకు వచ్చిన విరాట్‌ను చూసేందుకు వేలాది మంది అభిమానులు అరుణ్ జైట్లీ స్టేడియంకు చేరుకున్నారు. అయితే అటు అభిమానులకు, ఇటు రన్ మెషీన్ కు నిరాశే ఎదురైంది. రైల్వేస్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ బ్యాట్ మరోసారి పేలవ ప్రదర్శన చేయడంతో 6 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్‌కు (Virat Kohli Clean Bowled) చేరుకున్నాడు.
కేవలం 6 పరుగులకే విరాట్ కోహ్లీ ఔట్
విరాట్ కోహ్లీ చాలా కాలంగా ఫామ్‌లోకి రావడానికి చాలా కష్టపడుతున్నాడు. ఆస్ట్రేలియా పర్యటనలో అతను సెంచరీ సాధించాడు. అయితే కోహ్లీ టైమింగ్, అతను అవుట్ అయిన విధానంపై చాలా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ విమర్శలు, బ్యాడ్ ఫామ్ నుండి బయటపడేందుకు విరాట్ కోహ్లీ 13 సంవత్సరాల తర్వాత రంజీ క్రికెట్‌కు తిరిగి వచ్చాడు. కానీ ఇక్కడ కూడా అతను అభిమానులు, టీమిండియాను నిరాశపర్చాడు. రైల్వేస్‌తో జరిగిన మ్యాచ్‌లో అతను 6 పరుగులు మాత్రమే చేయగలిగి హిమాన్షు సాంగ్వాన్ చేతిలో ఔట్ అయ్యాడు. దీంతో అరుణ్ జైట్లీ స్టేడియంలో ఉన్న వేలాది మంది అభిమానులు కూడా తీవ్ర నిరాశకు గురయ్యారు.
Also Read: KCR Hot Comments: నేను కొడితే మాములుగా ఉండదు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
Harish Sangwan Knocked Out Virat King Kohli , At The Score of 6 (Full Crowd Reaction + Celebration) #ViratKohli𓃵 | #ViratKohli pic.twitter.com/QBHLRfsLKb
— 𝐒𝐑𝐈𝐉𝐀𝐍 🇮🇹 (@LegendDhonii) January 31, 2025
విరాట్ కోహ్లి ఫామ్‌తో టీమిండియాలో టెన్షన్
ఆస్ట్రేలియా పర్యటనలో అన్ని ఇన్నింగ్స్‌లలో విరాట్ కోహ్లి ఆఫ్-సైడ్ బంతిని కొట్టే ప్రయత్నంలో స్లిప్స్‌లో క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. సునీల్ గవాస్కర్‌తో సహా పలువురు సీనియర్ క్రికెటర్లు కోహ్లీ ఔట్ అయిన తీరుపై విమర్శలు చేశారు. రైల్వేస్‌తో జరిగిన రంజీ మ్యాచ్‌లో కింగ్ ఔట్ పద్ధతి మార్చుకుని బౌల్డ్ అయ్యాడు. అయితే ఆస్ట్రేలియా సిరీస్‌లో కోహ్లీ ఔట్ అయిన తీరు ఇంకా పరిష్కారం అయితే కాలేదు. ఇక కోహ్లీ ఫామ్ లో లేకపోవడం టీమ్ ఇండియాకు పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంది.