Site icon HashtagU Telugu

Virat Kohli: ఐపీఎల్ 2025లో విరాట్ కోహ్లీ రికార్డుల మోత‌.. ఖాతాలో మ‌రో ఘ‌న‌త‌!

Virat Kohli

Virat Kohli

Virat Kohli: ఐపీఎల్ 2025 52వ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ), చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) మ‌ధ్య మ్యాచ్ జ‌రిగింది. ఈ మ్యాచ్‌ ఎం. చిన్నస్వామి స్టేడియంలో జరిగింది. విరాట్ కోహ్లీ (Virat Kohli) ఈ మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన చేశాడు. ఆర్‌సీబీ తరపున అతను అద్భుతమైన అర్ధశతక ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. ఒక టీ-20 జట్టు తరపున 300 లేదా అంతకంటే ఎక్కువ సిక్సర్లు సాధించిన ప్రపంచంలోనే మొదటి ఆటగాడిగా నిలిచాడు. అంతేకాకుండా అతను క్రిస్ గేల్ రికార్డును కూడా బ్రేక్ చేశాడు. విరాట్ కోహ్లీ 33 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లతో 62 పరుగుల అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు.

విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు

టీ-20 క్రికెట్‌లో ఒక జట్టు తరపున అత్యధిక సిక్సర్లు సాధించిన రికార్డు ఇప్పుడు విరాట్ కోహ్లీ పేరిట నమోదైంది. అతను ఈ ఘనతను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున సాధించాడు. ఈ జాబితాలో రెండో స్థానంలో క్రిస్ గేల్ ఉన్నాడు. అతను ఆర్‌సీబీ త‌ర‌పున 263 సిక్సర్లు కొట్టాడు. మూడో స్థానంలో ముంబై ఇండియన్స్ ఆట‌గాడు రోహిత్ శర్మ ఉన్నాడు. అతని పేరిట 262 సిక్సర్లు ఉన్నాయి. నాల్గో స్థానంలో పొలార్డ్ ఉన్నాడు. అతను కూడా ముంబై ఇండియన్స్ కోసం 258 సిక్సర్లు సాధించాడు. అయితే ఐదో స్థానంలో ఎంఎస్ ధోనీ ఉన్నాడు. అతను చెన్నై సూపర్ కింగ్స్ కోసం మొత్తం 257 సిక్సర్లు కొట్టాడు.

టీ20లో ఒక జట్టు కోసం అత్యధిక సిక్సర్లు

విరాట్ కోహ్లీ మరో పెద్ద రికార్డును తన పేరిట న‌మోదు చేశాడు. టీ-20 క్రికెట్‌లో ఒకే మైదానంలో అత్యధిక సిక్సర్లు సాధించిన బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. అతను ఈ రికార్డును ఎం. చిన్నస్వామి స్టేడియంలో సృష్టించాడు. ఇక్కడ అతని పేరిట ఇప్పుడు 154 సిక్సర్లు ఉన్నాయి. ఈ విషయంలో అతను క్రిస్ గేల్‌ను వెనక్కి నెట్టాడు. గిల్ ఇదే మైదానంలో 151 సిక్సర్లు కొట్టాడు.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే మూడో స్థానంలో కూడా క్రిస్ గేల్‌నే ఉన్నాడు. అతను బంగ్లాదేశ్‌లోని మీర్‌పూర్ మైదానంలో 138 సిక్సర్లు సాధించాడు. నాల్గో స్థానంలో ఇంగ్లండ్‌కు చెందిన అలెక్స్ హేల్స్ ఉన్నాడు. అతను నాటింగ్‌హామ్‌లో 135 సిక్సర్లు కొట్టాడు. ఐదో స్థానంలో భారత్‌కు చెందిన రోహిత్ శర్మ ఉన్నాడు. అతని పేరిట వాంఖడే స్టేడియంలో 122 సిక్సర్లు నమోదయ్యాయి.

Also Read: MS Dhoni: ఎంఎస్ ధోనీ ఐపీఎల్‌కు గుడ్ బై చెప్ప‌నున్నాడా? అప్డేట్ ఇదే!

టీ20లో ఒకే మైదానంలో అత్యధిక సిక్సర్లు