Site icon HashtagU Telugu

Virat Kohli : విరాట్ కోహ్లీ సంచలన నిర్ణయం.. టెస్టులకు గుడ్​బై

Virat Kohli Announces Retir

Virat Kohli Announces Retir

ప్రపంచ క్రికెట్‌లో తనదైన ముద్ర వేసిన భారత దిగ్గజ క్రికెటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) టెస్ట్ క్రికెట్‌కు రిటైర్‌మెంట్ (Retirement from Test Cricket) ప్రకటించారు. 14 సంవత్సరాల పాటు భారత జాతీయ జెర్సీ ధరించి టెస్టు క్రికెట్‌లో దేశాన్ని ప్రతినిధ్యం వహించిన కోహ్లీ, తన కెరీర్‌ను గర్వకారణంగా ముగించారు. 2011లో వెస్ట్ ఇండీస్‌తో జరిగిన మ్యాచ్ ద్వారా కోహ్లీ టెస్ట్ అరంగేట్రం చేశారు. అప్పటి నుంచి ఎన్నో అద్భుత ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు.

Health Tips: రోజులో ఎక్కువ సేపు కుర్చీలో కూర్చొని పనిచేస్తున్నారా.. అయితే ఇది తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

విరాట్ కోహ్లీ తన టెస్ట్ కెరీర్‌లో మొత్తం 123 మ్యాచ్‌లు ఆడారు. ఇందులో 9,230 పరుగులు సాధించి, టాప్ క్లాస్ బ్యాట్స్‌మెన్‌గా తన ప్రతిభను ప్రదర్శించారు. టెస్టుల్లో 30 సెంచరీలు, 31 హాఫ్ సెంచరీలు చేసి, భారత క్రికెట్ అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. కెప్టెన్‌గా కూడ కోహ్లీ భారత టెస్ట్ జట్టును గొప్ప విజయాల వైపు నడిపించారు. అతని నాయకత్వంలో భారత్ విదేశాల్లోనూ అనేక విజయాలు సాధించింది.

2025 జనవరి 3న ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ కోహ్లీకి టెస్ట్ కెరీర్‌లో చివరిది. ఆ మ్యాచ్ అనంతరం కోహ్లీ తన టెస్ట్ జెర్సీకి వీడ్కోలు చెప్పారు. ఈ నిర్ణయం తో భారత క్రికెట్‌లో ఒక గొప్ప అధ్యాయం ముగిసింది. అయితే వన్డేలు మరియు టీ20ల్లో కోహ్లీ ఇంకా కొనసాగుతుండటం అభిమానులకు ఊరటనిస్తుంది.