virat kohli: టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. మరుసటిరోజే (మంగళవారం) విరాట్ కోహ్లీ, ఆయన సతీమణి, బాలీవుడ్ హీరోయిన్ అనుష్కశర్మతో కలిసి ఓ ఆధ్యాత్మిక కేంద్రాన్ని సందర్శించారు. ఉత్తరప్రదేశ్‌లోని బృందావన్ ధామ్‌కు వెళ్లిన ఈ జంట ప్రేమానంద్ మహారాజ్ ఆశీస్సులు తీసుకున్నారు. టెస్ట్ క్రికెట్‌కు రిటైర్‌మెంట్ తర్వాత కోహ్లీ పాల్గొన్న మొదటి వ్యక్తిగత కార్యక్రమం ఇది. కోహ్లీ, అనుష్క ప్రేమానంద్ మహారాజ్ వద్ద ఆశీర్వాదాలు తీసుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే, ప్రేమానంద్ మహారాజ్ విరాట్ కోహ్లీని ఆసక్తికర ప్రశ్న అడిగారు.
Also Read: 24 Fingers Family: ఆ ఫ్యామిలీలో 50 మందికి 24 వేళ్లు.. ఎందుకు ? ఎలా ?
ముందుగా ప్రేమానంద్ మహారాజ్ విరాట్ కోహ్లీ వైపు చూసి మీరు సంతోషంగా ఉన్నారా అని అడిగారు. అవును, నేను ఇప్పుడు బాగానే ఉన్నాను అని కోహ్లీ చిరునవ్వుతో బుదలిచ్చాడు. ఆ తరువాత ప్రేమానంద్ కోహ్లీకి జ్ఞానం ద్వారా మార్గనిర్దేశం చేశారు. జీవితంలో కష్ట సమయాలు వచ్చినప్పుడుల్లా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నారని అర్ధం చేసుకోండి. ఒకరి కీర్తి , కీర్తి పెరుగుదల దేవుని దయగా పరిగణించబడదు అనేది నిజం. ఒక వ్యక్తిలో ఆలోచనలో మార్పు వచ్చినప్పుడు ఆ దేవుడి దయ ఉంటుంది. దేవుడు మనకు అంతిమ శాంతి మార్గాన్ని చూపిస్తాడు. నా భక్తుడు ఎప్పుడూ నాశనం కాడని శ్రీ కృష్ణుడు గీతలో చెప్పాడు. ఆనందంతో దేవుని నామాన్ని జపించండి. అని సూచించారు. ఆధ్యాత్మిక ప్రవచనాలను శ్రద్ధగా కోహ్లీ, అనుష్క దంపతులు చివరిగా మహారాజ్ ఆశీర్వాదాలు తీసుకున్నారు.
Also Read: Banana: బాబోయ్.. అరటి పండ్లు ఎక్కువగా తినడం అంత డేంజరా?
ఎవరీ ప్రేమానంద్..
ప్రముఖ ఆధ్యాత్మిక గురువుల్లో ఒకరైన ప్రేమానంద్ మహారాజ్.. ధర్మం, భక్తి, ఆధ్యాత్మికత, జీవితం.. ఇలా క్లిష్టమైన అంశాలను ఎంతో సరళంగా, అందరికీ అర్థమయ్యేలా చెబుతుంటారు. ఎలా బతకాలి, సమస్యల్ని ఎలా అధిగమించాలో వివరిస్తుంటారు. భజనలు, ఉపన్యాసాలతో ఎంతో మంది భక్తులకు ఆయన చేరువయ్యారు. భక్తి, ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవారు తమ సమస్యలకు పరిష్కారాల కోసం ప్రేమానంద్‌ను కలుస్తుంటారు.
కోహ్లీ టెస్ట్ కెరీర్ సాగిందిలా..
టీ20 ప్రపంచకప్ 2024 విజేతగా భారత్ నిలిచిన తరువాత టీ20 ఫార్మాట్‌కు కోహ్లీ వీడ్కోలు పలికాడు. ఇప్పుడు టెస్టుల నుంచి రిటైర్ కావడంతో అతడు ఇక వన్డేల్లో మాత్రమే కనిపించనున్నాడు. టెస్టు క్రికెట్‌లో అతడు 123 మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ.. 46.9 సగటుతో 9,230 పరుగులు చేశాడు. ఇందులో 30 సెంచరీలు, 31 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోరు 254 నాటౌట్. భారత టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన నాలుగో ఆటగాడిగా విరాట్ కోహ్లీ నిలిచాడు. సచిన్ టెండూల్కర్ (15,921 పరుగులు), రాహుల్ ద్రవిడ్ (13,265 పరుగులు), సునీల్ గవాస్కర్ (10,122 పరుగులు) భారత్ తరుపున టెస్టుల్లో అత్యధిక పరుగులు సాధించిన జాబితాలో తొలి మూడు స్థానాల్లో ఉన్నారు.
VIRAT KOHLI AND ANUSHKA SHARMA MEET PREMANAND JI MAHARAJ. ⭐pic.twitter.com/gN4WCw5Grj
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 13, 2025