Virat Kohli: మరో రికార్డుకు చేరువలో విరాట్ కోహ్లీ.. అశ్విన్ కూడా..!

బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీలో భారత్‌-ఆస్ట్రేలియా (IND VS AUS) జట్ల మధ్య అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో చివరి టెస్టు మ్యాచ్‌ జరుగుతోంది.

  • Written By:
  • Publish Date - March 9, 2023 / 11:54 AM IST

బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీలో భారత్‌-ఆస్ట్రేలియా (IND VS AUS) జట్ల మధ్య అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో చివరి టెస్టు మ్యాచ్‌ జరుగుతోంది. ఈ సిరీస్‌లో ఇప్పటి వరకు ఆడిన మొదటి 3 టెస్టు మ్యాచ్‌ల్లో భారత జట్టు 2లో గెలుపొందగా, 1 టెస్టు మ్యాచ్‌లో కంగారూ జట్టు విజయం సాధించింది. అదే సమయంలో ఈ మ్యాచ్‌లో భారత జట్టులోని ఇద్దరు వెటరన్ ఆటగాళ్లు రవిచంద్రన్ అశ్విన్ (Ashwin), విరాట్ కోహ్లీ (Virat Kohli) కూడా కొన్ని కొత్త రికార్డులను చేరుకునే అవకాశం ఉంది.

విరాట్ కోహ్లీ ఈ సిరీస్‌లో అతని బ్యాట్ ఇంకా ఆశించిన స్థాయిలో రాణించలేదు. అయితే, అహ్మదాబాద్ టెస్ట్ మ్యాచ్‌లో అతను ఇంకా 42 పరుగులు చేయగలిగితే కోహ్లీ భారతదేశంలో టెస్ట్ క్రికెట్‌లో తన 4000 పరుగులను పూర్తి చేస్తాడు. విరాట్ కంటే ముందు సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, సునీల్ గవాస్కర్, వీరేంద్ర సెహ్వాగ్ మాత్రమే ఈ రికార్డుకు చేరుకోగలిగారు.

Also Read: Covid 19: వామ్మో కరోనా.. దేశవ్యాప్తంగా మళ్లీ పెరుగుతున్న కేసులు!

అహ్మదాబాద్ టెస్టు మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ ఈ ఘనత సాధిస్తే మూడో అత్యంత వేగవంతమైన భారత ఆటగాడు అవుతాడు. సునీల్ గవాస్కర్ 4,000 పరుగుల మైలురాయికి 87 ఇన్సింగ్స్ లను తీసుకుంటే, ద్రావిడ్ 88 ఇన్సింగ్ ల్లో సాధించాడు. కానీ, విరాట్ కోహ్లీ ఇప్పటి వరకు కేవలం 76 ఇన్సింగ్స్ లు ఆడి 3958 పరుగులు సాధించాడు. అంటే గవాస్కర్, ద్రవిడ్ తో పోలిస్తే కోహ్లీ అత్యంత వేగంగా 4,000 పరుగులు చేసిన క్రికెటర్ గా నిలవనున్నాడు. సెహ్వాగ్ 71 ఇన్నింగ్స్ ల్లో 4,000 పరుగులతో మొదటి స్థానంలో ఉంటే, సచిన్ 78 ఇన్సింగ్స్ ల్లో ఈ రికార్డు సాధించాడు.

రవిచంద్రన్ అశ్విన్ కూడా అంతర్జాతీయ క్రికెట్‌లో 700 వికెట్లు పూర్తి చేయడానికి కేవలం 9 వికెట్ల దూరంలో ఉన్నాడు. రవిచంద్రన్ అశ్విన్ టెస్టు క్రికెట్‌లో ఇప్పటివరకు 468 వికెట్లు తీయగా, వన్డేల్లో 151 వికెట్లు, టీ20ల్లో 72 వికెట్లు తీశాడు. ఇది కాకుండా, ఆస్ట్రేలియాపై భారత బౌలర్‌గా అత్యధిక వికెట్లు పడగొట్టడానికి రవిచంద్రన్ అశ్విన్ కేవలం 4 వికెట్ల దూరంలో ఉన్నాడు. ఇప్పటి వరకు ఆస్ట్రేలియాపై టెస్టు క్రికెట్‌లో 108 వికెట్లు పడగొట్టాడు.