Site icon HashtagU Telugu

Viral Fever Hits Pakistan: ఆస్ట్రేలియాతో మ్యాచ్‍కు ముందు పాక్ జట్టుకు షాక్.. జట్టులో వైరల్ ఫీవర్ కలకలం..!

Viral Fever Hits Pakistan

Compressjpeg.online 1280x720 Image (1) 11zon

Viral Fever Hits Pakistan: అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో బాబర్ అజామ్ సారథ్యంలోని పాకిస్థాన్ జట్టు ప్రపంచకప్‌లో భారత్‌తో మూడో మ్యాచ్ ఆడింది. ఇప్పుడు పాక్ జట్టు తన తదుపరి అంటే నాల్గవ మ్యాచ్‌ను శుక్రవారం అక్టోబర్ 20న ఆస్ట్రేలియాతో ఆడాల్సి ఉంది. అయితే అంతకు ముందు జట్టులోని కొంతమంది ఆటగాళ్ల అనారోగ్య వార్త వెలుగులోకి వచ్చింది. పాక్ జట్టులోని కొంతమంది ఆటగాళ్లు వైరల్ ఫీవర్‌ (Viral Fever Hits Pakistan)తో బాధపడుతున్నారు.

ఆస్ట్రేలియాతో జరిగే తదుపరి మ్యాచ్ కోసం పాకిస్థాన్ జట్టు బెంగళూరు చేరుకుంది. ‘ఇండియా టీవీ’ కథనం ప్రకారం బెంగళూరు వాతావరణం పాక్ ఆటగాళ్లకు అనుకూలంగా లేదు. మంగళవారం ఉదయం పాక్ టీమ్ నెట్ సెషన్‌లో వసీం జూనియర్ బౌలింగ్ చేయడం కనిపించింది. అయితే ఈ ప్రాక్టీస్‌లో జట్టులోని చాలా మంది కీలక ఆటగాళ్లు పాల్గొనలేదని సమాచారం. జట్టు తదుపరి నెట్ సెషన్ సాయంత్రం చిన్నస్వామి స్టేడియంలో జరగాల్సి ఉంది. ఇందులో చాలా మంది ఆటగాళ్లు పాల్గొనలేదని నివేదికలో పేర్కొంది. దింతో మంగళవారం ప్రాక్టీస్‌ సెషన్‌ రద్దయింది.

Also Read: PCB Files Complaint: అభిమానుల ప్రవర్తనపై ఐసీసీకి ఫిర్యాదు చేసిన పాక్..!

పాకిస్థాన్ తరఫున సెంచరీ చేసిన స్టార్ ఓపెనర్ అబ్దుల్లా షఫీక్ ప్రస్తుతం ఫర్వాలేదని నివేదికలో పేర్కొంది. కాగా పేసర్ షాహీన్ అఫ్రిది జ్వరం నుంచి కోలుకున్నాడు. దీంతో పాటు జట్టులోని పలువురు ఆటగాళ్లు కూడా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆస్ట్రేలియాతో మ్యాచ్‌కి ముందు పాకిస్థాన్‌కు కష్టాలు తప్పకపోవచ్చు. ఇప్పటికే పాక్ ఆటగాళ్లకు డెంగ్యూ, కొవిడ్-19 పరీక్షలు చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆటగాళ్లకు సాధారణ జ్వరమే వచ్చిందని, ఆస్ట్రేలియా మ్యాచ్ కల్లా కోలుకుంటారని మేనేజ్‍మెంట్ భావిస్తోంది. అక్టోబర్ 20న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా పాక్- ఆస్ట్రేలియా మ్యాచ్ జరగనుంది.

We’re now on WhatsApp. Click to Join.

ప్రపంచకప్‌లో పాకిస్థాన్ మూడు మ్యాచ్‌లు ఆడింది. అందులో పాక్ జట్టు 2 మ్యాచ్ లలో గెలుపొందింది. టోర్నీ తొలి మ్యాచ్‌లో బాబర్ సేన నెదర్లాండ్స్‌ను ఓడించింది. దీని తర్వాత వన్డే ప్రపంచకప్‌లో అతిపెద్ద లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో శ్రీలంకపై విజయం సాధించింది. తర్వాత భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో పాక్ జట్టు ఓటమి చవిచూడాల్సి వచ్చింది.