Vinesh Phogat Letter: పారిస్ ఒలింపిక్స్ 2024లో పతకం సాధించాలనే తన కల చెదిరిపోయిన తర్వాత వినేష్ ఫోగట్ చాలా భావోద్వేగ పోస్ట్ (Vinesh Phogat Letter) చేశారు. సోషల్ మీడియా పోస్ట్‌ల ద్వారా తన ప్రయాణం, పోరాటాన్ని వివరించారు. 3 పేజీల ప్రకటనలో వినేష్ తన రెజ్లింగ్ కెరీర్‌తో అనుబంధించబడిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ పోస్ట్‌లో వినేష్ తన అనిశ్చిత భవిష్యత్తు గురించి కూడా పేర్కొంది. పరిస్థితులు భిన్నంగా ఉంటే తను 2032 వరకు రెజ్లింగ్‌లో కొనసాగే అవకాశం ఉందని ఆమె రాసుకొచ్చింది.
2024 పారిస్ ఒలింపిక్స్‌లో వినేష్ 50 కిలోల ఫ్రీస్టైల్ రెజ్లింగ్ ఈవెంట్‌లో ఫైనల్స్‌కు చేరుకుంది. అయితే గోల్డ్ మెడల్ మ్యాచ్ రోజు ఆమె బరువు 100 గ్రాములు పెరిగింది. దీంతో వినేష్‌పై అనర్హత వేటు పడింది. ఆ తర్వాత వినేష్ రెజ్లింగ్‌కు రిటైర్మెంట్ ప్రకటించింది. రజత పతకం కోసం కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఆఫ్ స్పోర్ట్స్‌ని ఆశ్రయించింది. అయితే వినేష్ అప్పీలు బుధవారం (ఆగస్టు 14) కూడా తిరస్కరించారు. ఇప్పుడు వినేష్ పారిస్ ఒలింపిక్స్ నుండి ఖాళీ చేతులతో తిరిగి వస్తుంది. ఆమె ఆగస్టు 17 అంటే నేడు భారత్‌కు చేరుకుంటుంది.
Also Read: Afternoon Sleep: మధ్యాహ్నం నిద్ర మంచిదేనా..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..?
ఇంటికి తిరిగి రావడానికి ఒక రోజు ముందు (ఆగస్టు 16) వినేష్ సోషల్ మీడియా పోస్ట్ ద్వారా తన బాధను వ్యక్తం చేసింది. తన పోస్ట్‌లో వినేష్ తన తండ్రి ఆశలను, తన తల్లి కష్టాలను గుర్తు చేసుకున్నారు. ఆమె తన భర్త సోమ్‌వీర్‌కు ప్రతి హెచ్చు తగ్గులలో తనకు మద్దతుగా నిలిచినందుకు క్రెడిట్‌ను ఇచ్చింది. సెమీ ఫైనల్స్‌లో గెలిచిన తర్వాత వినేష్ బరువు 2.7 కిలోలు పెరిగింది. ఆమె ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఆమె చివరి 100 గ్రాముల బరువును తగ్గించలేకపోయింది.
వినేష్ తన పోస్ట్ చివరి భాగంలో ఇలా రాసింది. నా భవిష్యత్‌పై నాకు ఇంకా క్లారిటీ రాలేదు. 2032 వరకు కుస్తీ పట్టగలనని చాలాసార్లు అనుకున్నాను. ఎందుకంటే.. ఆ సత్తా ఉందనే నమ్మకం ఉండేది. కానీ ఇప్పుడు నా కోసం ఏం ఎదురుచూస్తోందో తెలియడం లేదు. నేను నమ్ముకున్న దాని గురించి నిరంతరం పోరాడుతూనే ఉంటానని కచ్చితంగా అనుకుంటున్నాను అంటూ వినేష్ రాసుకొచ్చింది.
We’re now on WhatsApp. Click to Join.