Olympic Games Paris 2024 : ఫైనల్ కు చేరుకున్న వినేశ్ ఫొగట్..

రేపు జరిగే ఫైనల్లో గెలిస్తే గోల్డ్, ఓడితే సిల్వర్ మెడల్ దక్కనుంది

Published By: HashtagU Telugu Desk
Vinesh Becomes First Indian

Vinesh Becomes First Indian

పారిస్ ఒలింపిక్స్ (Olympic Games Paris 2024 )లో భారత మహిళా రెజ్లర్ వినేశ్ ఫొగట్ (Vinesh Phogat) ఫైనల్లో (Final ) అడుగుపెట్టారు. సెమీస్లో క్యూబా రెజ్లర్ తో జరిగిన పోరులో ఆమె 5-0 తేడాతో ఘన విజయం సాధించారు. దీంతో భారత్ కు పతకం ఖాయమైంది. రేపు జరిగే ఫైనల్లో గెలిస్తే గోల్డ్ (Gold medal), ఓడితే సిల్వర్ మెడల్ దక్కనుంది. మరోవైపు ఒలింపిక్స్ చరిత్రలో భారత్ తరఫున ఫైనల్ చేరిన తొలి మహిళా రెజ్లర్ గా వినేశ్ చరిత్ర లిఖించారు.

We’re now on WhatsApp. Click to Join.

అంతకు ముందు డిఫెండింగ్‌ ఛాంపియన్‌ యువీ సుసాకిని ఓడించి వినేశ్‌ ఫోగట్‌ సంచలనం సృష్టించి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. ఈ మ్యాచ్‌లో చివరి నిమిషం ముందు వినేష్ 0-2తో వెనుకంజలో నిలువగా… చివరి నిమిషంలో పుంజుకుని విజయం సాధించింది. దీంతో వినేష్ ఫోగట్ పారిస్ ఒలింపిక్స్‌లో క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకుంది. పారిస్ ఒలింపిక్స్‌లో రెజ్లింగ్‌లో ఫైనల్ కు దూసుకెళ్లిన భారత రెజ్లర్ వినేశ్ ఫొగట్‌పై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఆమె రియల్ ఫైటర్ అని కొనియాడుతున్నారు. లైంగిక వేదింపుల ఆరోపణలో బ్రిజ్ భూషన్‌ను ఆరెస్ట్ చేయాలని ఢిల్లీ వీధుల్లో ఆమె కన్నీళ్లు పెట్టుకున్న క్షణాలను ఫ్యాన్స్ గుర్తుచేస్తున్నారు.

బీజేపీ మాజీ ఎంపీ, రెజ్లింగ్ ఫెడరేషన్ మాజీ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌ లైంగిక వేధింపుల కేసులో రోజుల తరబడి ఢిల్లీ నడిరోడ్ల మీద ఆందోళన చేసిన భారత మహిళా రెజ్లర్. మహిళా రెజ్లర్లపై లైంగిక దాడులకు పాల్పడ్డారని, ఆయనపై తక్షణ చర్యలు తీసుకోవాలంటూ రోడ్డెక్కిన రెజ్లర్లల్లో ఆమె ఒకరు. రోజుల తరబడి నిరసనలు కొనసాగించారు. ఇంటర్నేషనల్ పోడియం నుంచి ఫుట్‌పాత్ వరకు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌ ద్వారా ఎన్నో అవమానాలు, వేధింపులను ఎదుర్కొన్నామని, తమను ఎవరూ పట్టించుకోవట్లేదంటూ మీడియా ఎదురుగా కన్నీళ్లు పెట్టుకుంది. అలాంటి వినేష్ ఫొగట్.. ఈరోజు పారిస్ ఒలింపిక్స్ 2024లో ఫైనల్ కు చేరుకొని సత్తా చాటడమే కాదు అందరికి ఆదర్శమయ్యారు. ఓటమి వస్తే కుంగిపోవద్దని..సమస్య వస్తే అక్కడే ఉండిపోవద్దని ధైర్యంగా ఎదుర్కొని విజయం సాధించాలని వినేష్ ఫొగట్ నిరూపించింది.

Read Also : Migraine Symptoms: మైగ్రేన్ వ‌చ్చే ముందు క‌నిపించే ల‌క్ష‌ణాలివే..!

  Last Updated: 06 Aug 2024, 11:09 PM IST