Site icon HashtagU Telugu

Arshdeep Singh: ఇంగ్లాండ్‌లో టీమిండియా స్టార్ క్రికెట‌ర్ డ్యాన్స్‌.. వీడియో వైర‌ల్‌!

Arshdeep Singh

Arshdeep Singh

Arshdeep Singh: మాంచెస్టర్‌లో జరిగిన నాల్గవ టెస్ట్ మ్యాచ్‌ను టీమిండియా వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజాల చిరస్థాయిగా నిలిచే ఇన్నింగ్స్‌ల కారణంగా డ్రా చేయగలిగింది. ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ వ్యూహాలు ఏవీ సుందర్-జడేజాల జోడి ముందు పనిచేయలేదు. సుందర్ తన టెస్ట్ కెరీర్‌లో తొలి సెంచరీ సాధించి 101 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అదే సమయంలో జడేజా 107 పరుగుల అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఓల్డ్ ట్రాఫోర్డ్ మైదానంలో విజయం చేజారిపోవడంతో ఇంగ్లిష్ ఆటగాళ్లు తీవ్ర నిరాశకు గురయ్యారు.

అర్షదీప్ సింగ్ డ్యాన్స్ వైర‌ల్‌

కెప్టెన్ బెన్ స్టోక్స్‌తో సహా పలువురు ఇంగ్లీష్ ఆటగాళ్లు మ్యాచ్‌ను త్వరగా డ్రాగా ముగించడానికి జడేజా, సుందర్‌పై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేశారు. అయితే ఆతిథ్య జట్టు గాయాలపై ఉప్పు చల్లినట్లు భారత పేసర్ అర్షదీప్ సింగ్ (Arshdeep Singh) తన డ్యాన్స్ మూవ్స్‌తో అద‌ర‌గొట్టాడు. అర్షదీప్ డ్రెస్సింగ్ రూమ్‌లోకి వెళ్లే ముందు అభిమానుల ముందు భాంగ్రా చేస్తూ కనిపించాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైర‌ల్‌గా మారింది.

Also Read: Minister Lokesh: ఎంఓయూపై సంతకం చేశాక పూర్తి బాధ్యత మాదే: మంత్రి లోకేష్

పంజాబ్ కింగ్స్ తమ ఎక్స్ అకౌంట్‌లో షేర్ చేసిన ఒక వీడియోలో భారత ఆటగాళ్లు ఒక్కొక్కరుగా డ్రెస్సింగ్ రూమ్‌లోకి వెళుతుండగా జట్టు ప్రదర్శనతో ఎంతో సంతోషంగా ఉన్న అర్షదీప్ లోపలికి వెళ్తూ అభిమానుల ముందు భాంగ్రా చేయడం కనిపించింది. అర్షదీప్ ముఖంలో సంతోషం స్పష్టంగా కనిపించింది. అర్షదీప్ ఈ డ్యాన్స్ ఇంగ్లిష్ జట్టుకు మరింత నిరాశ కలిగించిన‌ట్లు తెలుస్తోంది. టెస్ట్ ఐదవ రోజు మూడు సెషన్లలో బౌలింగ్ చేసినప్పటికీ ఇంగ్లండ్ బౌలర్లు కేవలం 2 వికెట్లు మాత్రమే తీయగలిగారు. అర్షదీప్ ప్రాక్టీస్ సమయంలో గాయపడిన కారణంగా నాల్గవ టెస్ట్ మ్యాచ్ ఆడలేదు. అర్షదీప్ పూర్తిగా కోలుకుంటే, అతన్ని ఐదవ టెస్ట్‌లో బ‌రిలోకి దిగ‌వ‌చ్చు.

భారత జట్టు నుండి మూడు శతకాలు

రెండో ఇన్నింగ్స్‌లో భారత జట్టు తరఫున ముగ్గురు బ్యాట్స్‌మెన్‌లు సెంచరీలు సాధించారు. కేఎల్ రాహుల్ తన సెంచరీకి కేవలం 10 పరుగుల దూరంలో 90 పరుగులతో ఔటయ్యాడు. అయితే, కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఈ సిరీస్‌లో మరో సెంచరీ సాధించాడు. అలాగే జడేజా-సుందర్ కూడా శతకాలు బాదారు. సుందర్ తన 101 పరుగుల నాటౌట్ ఇన్నింగ్స్ సమయంలో 9 ఫోర్లు, ఒక సిక్సర్ సాధించాడు. ఇక జడేజా 13 ఫోర్లు, ఒక సిక్సర్ సహాయంతో 107 పరుగులు చేశాడు. ఈ అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శనతో భారత్ మ్యాచ్‌ను డ్రా చేసుకోవడంలో విజయం సాధించింది.