Site icon HashtagU Telugu

IPL Auction: ఆస్ట్రేలియాకు ఎదురుదెబ్బ‌.. ఐపీఎల్ వేల‌మే ముఖ్య‌మంటూ!

IPL Auction

IPL Auction

IPL Auction: ప్ర‌స్తుతం భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనలో ఉంది. నవంబర్ 22 నుంచి ఇరు జట్ల మధ్య టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌కు ముందు ఆస్ట్రేలియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆస్ట్రేలియా అసిస్టెంట్ కోచ్ డేనియల్ వెట్టోరి పెర్త్‌లో జరిగే మొదటి బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ టెస్ట్ కు దూరం కానున్నాడు. బదులుగా IPL 2025 మెగా వేలంలో (IPL Auction) పాల్గొనాలని నిర్ణయించుకున్నాడు.

వెట్టోరి.. క్రికెట్ ఆస్ట్రేలియాకు సమాచారం అందించాడు

ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్రధాన కోచ్‌గా కూడా డేనియల్ వెట్టోరి వ్యవహరిస్తున్నాడు. అయితే ఈ విషయాన్ని వెట్టోరి క్రికెట్ ఆస్ట్రేలియాకు తెలియజేశాడు. దీని తర్వాత వెట్టోరి ఇప్పుడు భారతదేశం vs ఆస్ట్రేలియా మధ్య జరిగే మొదటి టెస్ట్ కోసం ఆస్ట్రేలియా జట్టు బాధ్యతను వదిలివేయ‌నున్నాడు. జెడ్డాలో జరగనున్న IPL 2025 మెగా వేలంలో పాల్గొంటాడు.

Also Read: Lagacharla : లగచర్ల పర్యటనను అడ్డుకుంటే ఉద్యమాన్ని ఉదృతం చేస్తాం: తమ్మినేని వీరభద్రం

క్రికెట్ ఆస్ట్రేలియా నుండి ప్రకటన

పెర్త్ టెస్టుకు డేనియల్ వెట్టోరి తప్పుకోవడం గురించి క్రికెట్ ఆస్ట్రేలియా ప్రతినిధి మాట్లాడుతూ.. సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్రధాన కోచ్‌గా డేనియల్ వెట్టోరి పాత్రకు మేము చాలా మద్దతు ఇస్తున్నాము. ఐపీఎల్ వేలంలో పాల్గొనే ముందు వెట్టోరి తొలి టెస్టుకు తుది సన్నాహాలు పూర్తి చేస్తాడు. దీని తర్వాత అతను బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో మిగిలిన మ్యాచ్‌లకు జట్టుతో ఉంటాడ‌ని తెలిపారు.

నవంబర్ 22 నుంచి 26 వరకు పెర్త్‌లో భారత్, ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్టు మ్యాచ్ జరగనుంది. ఐపీఎల్ 2025 మెగా వేలం నవంబర్ 24, 25 తేదీల్లో జరగనుంది. ఇలాంటి పరిస్థితుల్లో తొలి టెస్టు మ్యాచ్‌కి మెగా వేలం ఢీకొనేలా కనిపిస్తోంది. ఇప్పుడు సన్‌రైజర్స్ హైదరాబాద్ కోచ్ వెట్టోరి జస్టిన్ లాంగర్ (లక్నో సూపర్ జెయింట్స్), బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024 కోసం ఛానల్ సెవెన్‌తో కామెంటరీ టీమ్‌లో భాగమైన రికీ పాంటింగ్ (పంజాబ్ కింగ్స్)తో కలిసి ప్రయాణించనున్నారు.

Exit mobile version