Site icon HashtagU Telugu

Uppal Stadium: వరల్డ్ కప్ కు ముస్తాబవుతున్న ఉప్పల్ స్టేడియం, 2.5 కోట్లతో ప్రత్యేక వసతులు

Uppal Stadium

Uppal Stadium

Uppal Stadium: త్వరలోనే వన్డే ప్రపంచ కప్ ప్రారంభం కాబోతుండటంతో క్రికెట్ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఏ స్టేడియంలో ఏ మ్యాచ్ జరుగుబోతుందో ముందు తెలుసుకొని అక్కడ వాలిపోయేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో అక్టోబరు 5 నుంచి ప్రారంభమయ్యే పురుషుల వన్డే ప్రపంచకప్‌కు ఆతిథ్యం ఇస్తున్న 12 వేదికల్లో ఉప్పల్ స్టేడియం (రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం) ఒకటి. అయితే అంతర్జాతీయ క్రికెట్ కమిటీ (ఐసీసీ) బృందం హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియాన్ని పరిశీలించిందని, స్టేడియం నిర్వహణ పట్ల సంతోషంగా ఉన్నామని కె దుర్గాప్రసాద్ తెలిపారు.

ఇతర విభాగాలతో కూడిన 20 మంది సభ్యుల బృందం రెండున్నర గంటలకు పైగా ఉప్పల్ స్టేడియాన్ని పరిశీలించింది. “వారు సౌకర్యాలతో సంతోషంగా ఉన్నారు. కొన్ని మార్పులను సూచించారు. ఒక వారంలోపు వివరణాత్మక నివేదికను పంపుతారు. అది అందిన తర్వాత అవసరమైన మార్పులు చేస్తాం’’ అని దుర్గాప్రసాద్ వెల్లడించారు. ప్రపంచ కప్ ప్రారంభానికి ముందే అప్‌గ్రేడేషన్ పూర్తవుతుందని ఆయన చెప్పాడు. “స్టేడియం నవీకరణ ఇప్పటికే ప్రారంభమైంది. మేము ఫ్లడ్ లైట్లను LED లతో ఏర్పాటు చేసినట్టు తెలిపారు.

అన్ని ప్రపంచకప్ వేదికల మాదిరిగానే టర్న్‌స్టైల్స్‌ను తాము చూసుకుంటామని బీసీసీఐ తెలిపిందని CRPF మాజీ డైరెక్టర్ జనరల్ తెలిపారు.  వారాంతంలోగా కొత్త సీట్ల కోసం అధికారులు ఆర్డర్ ఇవ్వనున్నారు. నార్త్, సౌత్ గ్యాలరీలలో గ్రౌండ్ లెవల్‌లో కొత్త సీటింగ్ ఉంటుంది. ప్రపంచ కప్ ప్రారంభం నాటికి పూర్తిగా కొత్త స్టేడియాన్ని తీసుకొస్తామని తెలిపారు. మైదానానికి కొత్త పరికరాల కోసం రూ.2.5 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. గతంలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్ ల మాదిరిగా కాకుండా ఈసారి అధునాతన హంగులతో స్టేడియం ముస్తాబు కాబోతోంది.

Also Read: Tech Park: హైదరాబాద్ లో టెకీ పార్క్.. కబుర్లు చెప్పుకుంటు హాయిగా పనిచేసుకోవచ్చు!