WTC Points Table: ఇంగ్లండ్‌తో జరిగిన మూడో, చివరి టెస్టులో శ్రీలంక 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అంతకుముందు 2014లో తమ స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో శ్రీలంక విజయం సాధించింది. ఇప్పుడు 10 సంవత్సరాల తర్వాత చరిత్రను పునరావృతం చేస్తూ శ్రీలంక మరోసారి వారి స్వదేశంలో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ను ఓడించింది. అయితే, ఈ శ్రీలంక విజయం తర్వాత ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో టీమిండియా పాయింట్ల పట్టిక (WTC Points Table)లో ఏమైనా తేడా వచ్చిందా..? ఈ మ్యాచ్ తర్వాత పాయింట్ల పట్టిక పరిస్థితి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఇంగ్లండ్‌పై విజయంతో శ్రీలంక ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో ఐదవ ర్యాంక్‌లో నిలిచింది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2023-25 సైకిల్‌లో శ్రీలంక ఇప్పటివరకు 7 మ్యాచ్‌లు ఆడింది. అందులో వారు 3 గెలిచారు. 4 ఓడారు. జట్టు గెలుపు శాతం 42.86గా ఉంది. కాగా ఓడిన ఇంగ్లండ్ ఆరో స్థానంలో ఉంది. ఈ సైకిల్‌లో ఇంగ్లండ్ ఇప్పటివరకు 16 టెస్టులు ఆడింది. అందులో 8 గెలిచింది. 7 ఓడిపోయింది. 1 డ్రాగా ముగిసింది. ఇంగ్లండ్ విజయ శాతం 42.19గా ఉంది.
Also Read: Union Minister Bandi Sanjay: రైల్వే మంత్రికి కేంద్ర మంత్రి బండి సంజయ్ లేఖ.. ఏం అడిగారంటే.?
శ్రీలంక విజయంతో భారత్‌కు లాభం..!
ఇంగ్లండ్‌పై శ్రీలంక విజయం కారణంగా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో భారత జట్టు ఎటువంటి నష్టాన్ని చవిచూడలేదు. అంతేకాకుండా పాయింట్ల పట్టికలో భారత్‌కు లాభం చేరింది. ఈ మ్యాచ్‌కి ముందు కూడా టీమ్ ఇండియా టేబుల్‌లో టాప్ పొజిషన్‌లో కొనసాగుతూనే ఉంది. ఈ సైకిల్‌లో భారత జట్టు ఇప్పటివరకు 9 టెస్టులు ఆడింది. ఇందులో 6 గెలిచారు. 2 ఓడిపోయారు, 1 డ్రాగా ముగిసింది. టీమ్ ఇండియా గెలుపు శాతం 68.52గా ఉంది. బంగ్లాదేశ్‌తో భారత జట్టు తదుపరి టెస్టు సిరీస్ ఆడనుంది. సెప్టెంబర్ 19 నుంచి భారత్, బంగ్లాదేశ్ మధ్య 2 టెస్టులు జరగనున్నాయి.
పాయింట్ల పట్టికలో టాప్-5 జట్లు ఇవే
ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో టీమిండియా పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత ఆస్ట్రేలియా 62.50 గెలుపు శాతంతో రెండో స్థానంలో, న్యూజిలాండ్ 50.00 గెలుపు శాతంతో మూడో స్థానంలో, బంగ్లాదేశ్ 45.83 గెలుపు శాతంతో నాలుగో స్థానంలో, శ్రీలంక 42.86 గెలుపు శాతంతో ఐదో స్థానంలో ఉన్నాయి.