Upcoming ICC Tournaments: 2031 వ‌ర‌కు జ‌ర‌గ‌నున్న ఐసీసీ టోర్నీలు ఇవే.. భార‌త్ ఆతిథ్యం ఇవ్వ‌నుందా?

ICC ఛాంపియన్స్ ట్రోఫీ 2025 తర్వాత ICC వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైన‌ల్‌ మ్యాచ్ ఈ సంవత్సరం ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్ ఆస్ట్రేలియా- దక్షిణాఫ్రికా మధ్య జరుగుతుంది.

Published By: HashtagU Telugu Desk
Rohit Sharma

Rohit Sharma

Upcoming ICC Tournaments: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫిబ్రవరి 19 నుండి మార్చి 9 వరకు జరిగింది. ఇందులో టీమ్ ఇండియా గెలిచింది. ఇంతకుముందు ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2024 ఆడింది. అది కూడా భారత జట్టు గెలిచింది. అయితే తదుపరి ఐసీసీ టోర్నీ ఎప్పుడు, ఎక్కడ జరుగుతుందో, ఏ దేశం ఆతిథ్యం ఇస్తుందో తెలుసా? క్రికెట్ అభిమానులకు రాబోయే 6 సంవత్సరాల ICC టోర్నమెంట్ల (Upcoming ICC Tournaments) షెడ్యూల్‌ను ఇక్క‌డ తెలుసుకుందాం.

ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత ఏ ఐసీసీ ఈవెంట్ జరుగుతుంది?

ICC ఛాంపియన్స్ ట్రోఫీ 2025 తర్వాత ICC వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైన‌ల్‌ మ్యాచ్ ఈ సంవత్సరం ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్ ఆస్ట్రేలియా- దక్షిణాఫ్రికా మధ్య జరుగుతుంది. వచ్చే ఏడాది అంటే 2026లో టీ20 ప్రపంచకప్‌ జరగనుంది. ఆ తర్వాత ODI ప్రపంచకప్, WTC ఫైనల్ 2027 సంవత్సరంలో జరుగుతాయి. 2028లో టీ20 ప్రపంచకప్. WTC ఫైనల్ 2029 సంవత్సరంలో జ‌ర‌గ‌నుంది. ఆ తర్వాత 2030లో టీ20 ప్రపంచకప్ నిర్వహించనున్నారు. ఇది కాకుండా 2031లో వన్డే ప్రపంచకప్ ఆడాల్సి ఉంది.

Also Read: Wrestling Federation Of India: భారత రెజ్లింగ్ సమాఖ్యపై సస్పెన్షన్ ఎత్తివేత

వచ్చే 6 సంవత్సరాలలో భారత్‌లో మూడు టోర్నమెంట్‌లకు ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది. అయితే రెండు టోర్నీల్లో భారత్ ఆతిథ్యం పంచుకోనుంది. 2026లో జరిగే టీ20 ప్రపంచకప్‌ నిర్వహణ భారత్‌, శ్రీలంక చేతుల్లో ఉంది. కాగా, 2029లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి భారత్ ఆతిథ్యం ఇస్తోంది. దీంతో పాటు 2031లో భారత్‌, బంగ్లాదేశ్‌లలో వన్డే ప్రపంచకప్‌ జరగనుంది.

2025 నుండి 2031 వరకు షెడ్యూల్

  • ICC వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ 2025 (ఇంగ్లండ్)
  • ICC T20 ప్రపంచ కప్ 2026 (భారత్-శ్రీలంక)
  • ICC వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ 2027 (ఇంగ్లండ్)
  • ICC ODI ప్రపంచ కప్ 2027 (దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా)
  • ICC T20 ప్రపంచ కప్ 2028 (ఆస్ట్రేలియా, న్యూజిలాండ్)
  • ICC ఛాంపియన్స్ ట్రోఫీ 2029 (భారతదేశం)
  • ICC T20 ప్రపంచ కప్ 2030 (ఇంగ్లండ్, ఐర్లాండ్, స్కాట్లాండ్)
  • ICC ODI ప్రపంచ కప్ 2031 (భారతదేశం, బంగ్లాదేశ్)
  Last Updated: 11 Mar 2025, 11:47 AM IST