IPL 2023 Retirement: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ సీజన్‌పై రోజురోజుకూ ఉత్కంఠ పెరుగుతోంది. ఇప్పటి వరకు జరిగిన మొత్తం 26 మ్యాచ్‌ల్లో జట్ల మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది. ఈ లీగ్‌లో చాలా మంది యువ మరియు సీనియర్ ఆటగాళ్ళు అద్భుతంగా ప్రదర్శన చేస్తూ అందరి హృదయాలను గెలుచుకుంటున్నారు. అయితే ఈ ఏడాది ఐపీఎల్ తర్వాత అభిమానులకు కొందరు క్రికెటర్లు కోలుకోలేని షాక్ ఇవ్వనున్నారట. ఈ ఏడాది IPL సీజన్ వారికి చివరి టోర్నమెంట్ కావచ్చు అని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
CSK జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ గురించి ప్రముఖ మీడియా నివేదికల ప్రకారం IPL 2023 ధోనీకి చివరి సీజన్ అని పేర్కొంది. ధోని ఐపిఎల్ 17వ సీజన్‌లో ఆడటం కష్టమేనంటూ అలాగే మరికొందరి ఆటగాళ్ల పేర్లను ప్రస్తావించింది. ఐపీఎల్‌లో 179 ఇన్నింగ్స్‌లు ఆడి ఒక సెంచరీ, 22 హాఫ్ సెంచరీలతో మొత్తం 4250 పరుగులు చేసిన చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ప్లేయర్ అంబటి రాయుడు ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉన్నాడు. ఈ సీజన్‌లో రాయుడు ఇప్పటివరకు ఆడిన మొత్తం 5 మ్యాచ్‌లలో 74 పరుగులు మాత్రమే చేసాడు, అయితే ఈ సీజన్ అతని చివరి IPL సీజన్ కావచ్చు.
ఈ జాబితాలో రెండో స్థానంలో లక్నో సూపర్ జెయింట్స్ తరఫున ఆడుతున్న అమిత్ మిశ్రా పేరు ఉంది. ఐపీఎల్ కెరీర్‌లో మొత్తం 169 వికెట్లు తీసిన అనిల్ కుంబ్లే తర్వాత లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రా అత్యుత్తమ స్పిన్నర్‌గా రాణించాడు. మిశ్రా ప్రస్తుత ఎకానమీ రేటు 7.35. 40 ఏళ్ల వయస్సులో అమిత్ మిశ్రా IPL 2023లో అద్భుతంగా రాణిస్తున్నాడు. అయితే వయస్సు కారణంగా ఈ సీజన్ అతని చివరి సీజన్ కావచ్చని తెలుస్తుంది.
3 ఏళ్ల తర్వాత టీ20 ప్రపంచకప్‌కు భారత జట్టులోకి వచ్చిన టీమ్ ఇండియా వికెట్ కీపర్, బ్యాట్స్‌మెన్ దినేష్ కార్తీక్ ఈ జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు. RCB జట్టులో దినేష్ కార్తీక్ అత్యుత్తమ ఫినిషర్ గా కొనసాగుతున్నాడు. ఈ సీజన్‌లో మొత్తం 5 మ్యాచ్‌లు ఆడిన దినేష్ కార్తీక్ 38 పరుగులు మాత్రమే చేశాడు. దినేష్ కార్తీక్ కి ఈ సీజన్ చివరి సీజన్ కావచ్చు అని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
Read More: Gary Ballance: స్టార్ క్రికెటర్ రిటైర్మెంట్