Site icon HashtagU Telugu

Top ODI Captains: వన్డే క్రికెట్‌లో అత్యధిక విజయాలు సాధించిన కెప్టెన్‌లు వీరే.. టీమిండియా నుంచి ఇద్ద‌రే!

Top ODI Captains

Top ODI Captains

Top ODI Captains: వన్డే క్రికెట్‌లో (Top ODI Captains) అత్యధిక విజయాలు సాధించిన కెప్టెన్‌గా ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ అగ్రస్థానంలో ఉన్నారు. ఈ టాప్-7 జాబితాలో ఆస్ట్రేలియాకు చెందిన మరో మాజీ దిగ్గజ కెప్టెన్ అలెన్ బోర్డర్ కూడా ఉన్నారు. భారత్ తరఫున ఇద్దరు మాజీ దిగ్గజ కెప్టెన్లు మహేంద్ర సింగ్ ధోని, మహ్మద్ అజారుద్దీన్ కూడా ఈ లిస్ట్‌లో చోటు దక్కించుకున్నారు. అయితే ఆశ్చర్యకరంగా ఈ రికార్డు జాబితాలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి ప్రస్తుత దిగ్గజ ఆట‌గాళ్ల పేర్లు లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం.

వన్డే క్రికెట్‌లో అత్యధిక విజయాలు సాధించిన టాప్-7 కెప్టెన్‌లు

165 విజయాలతో రికీ పాంటింగ్ అగ్రస్థానం

ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ వన్డే క్రికెట్‌లో తిరుగులేని రికార్డు సృష్టించారు. ఆయన కెప్టెన్సీలో ఆస్ట్రేలియా 230 మ్యాచ్‌లు ఆడి ఏకంగా 165 విజయాలు సాధించింది. పాంటింగ్ నాయకత్వంలోనే ఆ జట్టు 2003, 2007లో వరుసగా రెండు వన్డే ప్రపంచ కప్‌లను కైవసం చేసుకుంది.

ధోని నాయకత్వంలో టీమిండియాకు 110 విజయాలు

భారతదేశానికి చెందిన దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఈ జాబితాలో రెండవ స్థానం దక్కించుకున్నారు. ధోని సారథ్యంలో భారత్ 200 వన్డే మ్యాచ్‌లు ఆడి 110 విజయాలు నమోదు చేసింది. 2011లో వన్డే ప్రపంచ కప్, 2013లో ఛాంపియన్స్ ట్రోఫీ వంటి ముఖ్య విజయాలు ధోని ఖాతాలో ఉన్నాయి.

Also Read: Heart Attack Causes: మీ శ‌రీరంలో ఇలాంటి సంకేతాలు క‌నిపిస్తున్నాయా? అయితే చాలా జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే!

టాప్-7లో ఇద్దరు ఆస్ట్రేలియన్లు, ఇద్దరు భారతీయులు

ఈ జాబితాలో ధోనితో పాటు మరో భారత మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ కూడా ఉన్నారు. అజారుద్దీన్ నాయకత్వంలో భారత్ 174 మ్యాచ్‌లు ఆడి 90 విజయాలు సాధించి ఏడవ స్థానంలో నిలిచాడు. ఆస్ట్రేలియా నుంచి పాంటింగ్‌తో పాటు అలెన్ బోర్డర్ (178 మ్యాచ్‌లు – 107 విజయాలు) మూడవ స్థానంలో ఉన్నారు. వీరి నాయకత్వంలోనే ఆస్ట్రేలియా 1987లో తొలి ప్రపంచ కప్‌ను గెలుచుకుంది.

ఈ జాబితాలో దక్షిణాఫ్రికాకు చెందిన హాన్సీ క్రోన్యే (138 మ్యాచ్‌లు – 99 విజయాలు) నాలుగవ స్థానంలో, గ్రేమ్ స్మిత్ (150 మ్యాచ్‌లు – 92 విజయాలు) ఆరవ స్థానంలో ఉన్నారు. న్యూజిలాండ్‌కు చెందిన స్టీఫెన్ ఫ్లెమింగ్ (218 మ్యాచ్‌లు – 98 విజయాలు) ఐదవ స్థానంలో కొనసాగుతున్నారు.

Exit mobile version