world cup 2023: భారత్ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్ ఆసక్తికరంగా సాగుతోంది. అన్ని జట్లు సెమీస్ చేరడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాయి. ఇక మెగా టోర్నీ లీగ్ ఫేజ్ చివరి దశకు చేరుకుంది. మరో వారం రోజుల్లో లీగ్ దశ ముగుస్తుంది. అనంతరం సెమీఫైనల్ మ్యాచ్ లు ఆరంభం అవుతాయి. ఈ నేపథ్యంలో సెమీ ఫైనల్స్ రేసు హీట్ పెంచుతోంది. ఇదిలా ఉండగా ఈ ప్రపంచకప్ లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న బౌలర్లు తమ అద్భుతమైన ప్రదర్శనతో మెరిశారు. భీకర ఫామ్ లో ఉన్న బ్యాటర్లను పెవిలియన్ చేర్చడంలో బౌలర్లు సక్సెస్ అయ్యారు.
శ్రీలంక సెమీఫైనల్ రేసులో లేనప్పటికీ, ఆ జట్టు ఫాస్ట్ బౌలర్ దిల్షాన్ మధుశంక తన బౌలింగ్ తో ఆకట్టుకున్నాడు. మధుశంక ఇప్పటి వరకు ఆడిన 8 మ్యాచ్‌ల్లో మొత్తం 21 వికెట్లు పడగొట్టాడు. దిల్షాన్ ఈ ప్రపంచకప్ లో అత్యధిక వికెట్లు పడగొట్టిన ఆటగాడిగా టాప్ ప్లేస్ లో కొనసాగుతున్నాడు. ప్రపంచకప్ లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడు ఆడమ్ జంపా రెండో స్థానంలో ఉన్నాడు. టోర్నీలో ఇప్పటి వరకు ఆడిన 8 మ్యాచ్‌ల్లో జంపా మొత్తం 20 వికెట్లు పడగొట్టాడు. దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ మార్కో జెన్సన్ అత్యధిక వికెట్లు పడగొట్టిన ఆటగాళ్లలో మూడో స్థానంలో ఉన్నాడు . జెన్సన్ 8 మ్యాచ్‌ల్లో 17 వికెట్లు తీశాడు. ప్రపంచకప్ లో అత్యధిక వికెట్లు తీసిన వారి జాబితాలో మహ్మద్ షమీ నాలుగో స్థానంలో ఉన్నాడు. ఈ టోర్నీలో అద్భుతమైన ఫామ్‌లో కనిపించిన షమీ కేవలం 4 మ్యాచ్‌ల్లోనే 16 వికెట్లు పడగొట్టాడు. షమీ ఒక ఇన్నింగ్స్‌లో రెండుసార్లు ఐదు వికెట్లు తీసిన ఘనత సాధించాడు. ప్రపంచకప్‌లో అత్యధిక వికెట్లు తీసిన పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ షాహీన్ షా అఫ్రిది ఐదో స్థానంలో ఉన్నాడు. అఫ్రిది 8 మ్యాచ్‌ల్లో మొత్తం 16 మంది బ్యాట్స్‌మెన్‌లకు పెవిలియన్ దారి చూపించాడు.
Also Read: world cup 2023: పది పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన పాకిస్తాన్