Site icon HashtagU Telugu

WTC Final 2023: అశ్విన్‌ ‘క్యారమ్ బాల్’ నేర్చుకుంటున్న టాడ్ మర్ఫీ

WTC Final 2023

New Web Story Copy 2023 05 31t201931.084

WTC Final 2023: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. జూన్ 7 నుంచి ఓవల్‌లో జరిగే డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా ఆస్ట్రేలియాతో తలపడనుంది. టైటిల్‌ పోరుకు ఇరు జట్లు జోరుగా సన్నాహాలు ప్రారంభించాయి.

రవిచంద్రన్ అశ్విన్ క్యారమ్ బాల్ తో మాయ చేయగలడు. అయితే ఆస్ట్రేలియా స్పిన్ బౌలర్ టాడ్ మర్ఫీ అశ్విన్ క్యారమ్ బాల్ ని నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు. వాస్తవానికి రవిచంద్రన్ అశ్విన్‌కు అతిపెద్ద బలంగా భావించే ‘క్యారమ్ బాల్’ విసిరే నైపుణ్యాన్ని టాడ్ మర్ఫీ నేర్చుకుంటున్నాడు.

భారత్ – ఆస్ట్రేలియా మధ్య జరిగిన బోర్డర్-గవాస్కర్ సిరీస్‌లో టాడ్ మర్ఫీ తన స్పిన్ బౌలింగ్‌తో మాయాజాలం చేశాడు. సిరీస్‌లోని నాలుగు మ్యాచ్‌ల్లోనూ భారత బ్యాట్స్‌మెన్‌లను చాలా ఇబ్బంది పెట్టాడు. మర్ఫీ నాలుగు టెస్టుల్లో మొత్తం 14 వికెట్లు పడగొట్టాడు. ఇదిలా ఉండగా డబ్ల్యూటీసీ ఫైనల్‌లో ఓవల్ పిచ్ స్పిన్ బౌలర్లకు అనుకూలంగా ఉందంటున్నారు క్రికెట్ నిపుణులు. ఈ పరిస్థితిలో మర్ఫీ తన స్పిన్ తో భారత బ్యాట్స్‌మెన్‌లకు తలనొప్పిగా మారే అవకాశం లేకపోలేదు.

Read More: Krishna – Mahesh : కృష్ణ మహేశ్ బాబు కలిసి ఎన్ని సినిమాల్లో నటించారో తెలుసా?