Sachin Tendulkar: సచిన్ 50వ పుట్టిన రోజు సందర్భంగా వాంఖడేలో ముంబై క్రికెట్ అసోసియేషన్ సచిన్ విగ్రహం ఏర్పాటు చేసింది. అయితే ఈ విగ్రహంపై ట్రోల్స్ వస్తున్నాయి. ముంబై వాంఖడే స్టేడియంలో సచిన్ ఏ షాట్ ఆడిన విగ్రహం ఏర్పాటు చేయాలని ఎంసీఏ అధికారులు చాలా శ్రమ పడినట్లు తెలుస్తోంది. చివరకు ఈ స్ట్రెయిట్ లాఫ్టెడ్ షాట్ ఫొటోను ఎంపిక చేయగా.. సచిన్ కూడా ఇది బాగుందని చెప్పాడట.
దీంతో ఇదే విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. కాగా.. స్టేడియంలో సచిన్ స్టాండ్‌కు సమీపంలోనే దీన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో సచిన్ తన కుటుంబంతో కలిసి పాల్గొన్నారు. దీన్ని చూసేందుకు చాలా మంది అభిమానులు చాలా ముందుగానే స్టేడియానికి వచ్చారు. సచిన్ పోలికలు లేవంటూ కొందరు ట్రోల్స్ చేస్తున్నారు. అభిమానులు కూడా కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
అంతాబాగానే ఉన్న సచిన్ విగ్రహంపై అభిమానులు కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆ విగ్రహం రూపు రేఖలు టెండూల్కర్ ముఖాన్ని పోలి ఉండటం కంటే.. స్మిత్‌ను గుర్తు చేస్తోందంటూ కామెంట్స్ చూఏస్తున్నారు. సచిన్ విగ్రహాన్ని సరిగ్గా రూపొందించలేందంటూ విమర్శలు చేస్తున్నారు. ప్రస్తుతం సచిన్ విగ్రహం ఫొటోలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.