- వెంకటేష్ అయ్యర్‌ను రూ. 7 కోట్లకు కొనుగోలు చేసిన ఆర్సీబీ
- గతేడాది కంటే తక్కువ ధర పలికిన టీమిండియా ఆల్ రౌండర్
Venkatesh Iyer: అబుదాబీలో జరుగుతున్న ఐపీఎల్ 2026 మినీ వేలంలో ఒకవైపు ఆస్ట్రేలియా ఆటగాడు కామెరూన్ గ్రీన్‌పై కాసుల వర్షం కురవగా.. మరోవైపు ఒక భారత ఆటగాడు భారీగా నష్టపోయాడు. గత మెగా వేలంలో భారీ ధరకు అమ్ముడైన ఈ ఆటగాడి విలువ ఈ ఏడాది భారీగా పడిపోయింది. అతనే భారత ఆల్‌రౌండర్ వెంకటేష్ అయ్యర్. గత వేలంతో పోలిస్తే అతనికి రూ. 16.75 కోట్ల భారీ నష్టం వాటిల్లింది.
వెంకటేష్ అయ్యర్‌కు రూ. 16.75 కోట్ల నష్టం
గత ఏడాది జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో కోల్‌కతా నైట్ రైడర్స్ వెంకటేష్ అయ్యర్‌ను రూ. 23.75 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. అయితే, ఐపీఎల్ 2025 సీజన్‌లో వెంకటేష్ ప్రదర్శన చాలా నిరాశాజనకంగా ఉండటంతో కేకేఆర్ అతడిని విడుదల చేసింది. ఈ క్రమంలో ఐపీఎల్ 2026 మినీ వేలం కోసం వెంకటేష్ అయ్యర్ రూ. 2 కోట్ల బేస్ ప్రైస్‌తో తన పేరును నమోదు చేసుకున్నాడు. వేలంలో వెంకటేష్‌ను కొనుగోలు చేసేందుకు కొన్ని జట్లు ఆసక్తి చూపినప్పటికీ.. ఎవరూ పెద్దగా బిడ్లు వేయలేదు. చివరకు ఐపీఎల్ 2025 ఛాంపియన్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అతడిని రూ. 7 కోట్లకు దక్కించుకుంది. దీనివల్ల గత సీజన్‌లో రూ. 23.75 కోట్లు పొందిన వెంకటేష్, వచ్చే సీజన్ కోసం కేవలం రూ. 7 కోట్లు మాత్రమే అందుకోనున్నాడు.
Venkatesh Iyer joins the defending champions 😎
The all-rounder will play for @RCBTweets for INR 7 Crore ❤️ #TATAIPL | #TATAIPLAuction pic.twitter.com/Lcrz8xsquu
— IndianPremierLeague (@IPL) December 16, 2025
Also Read: మతీషా పతిరానాను రూ. 18 కోట్లకు దక్కించుకున్న కోల్‌కతా నైట్ రైడర్స్
వెంకటేష్ అయ్యర్ ఐపీఎల్ కెరీర్
ఈ ఎడమచేతి వాటం బ్యాటర్ అయిన వెంకటేష్ అయ్యర్ 2021లో కోల్‌కతా నైట్ రైడర్స్ తరపున ఐపీఎల్‌లోకి అడుగుపెట్టాడు. అప్పటి నుండి అతను కేకేఆర్ జట్టులోనే కొనసాగాడు. అతను ఐపీఎల్‌లో ఇప్పటివరకు 62 మ్యాచ్‌లు ఆడి, 29.95 సగటుతో మొత్తం 1468 పరుగులు చేశాడు. ఐపీఎల్‌లో అతని స్ట్రైక్ రేట్ 137.33గా ఉంది. ఇప్పటివరకు అతను ఒక సెంచరీ, 12 అర్ధ సెంచరీలు సాధించాడు.
