Teamindia Players: 2023 ప్రపంచకప్‌కు టీమిండియా (Teamindia Players) దాదాపుగా సన్నాహాలను పూర్తి చేసుకుంది. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో భారత జట్టు విజయం సాధించింది. ఇంతకు ముందు ఆసియా కప్ టైటిల్‌ను గెలుచుకుంది. మహ్మద్ సిరాజ్ గత కొన్ని మ్యాచ్‌ల్లో భారత్ తరఫున అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు. ప్రపంచకప్‌లో అతను టీమ్ ఇండియాకు గేమ్ ఛేంజర్‌గా నిరూపించుకునే అవకాశం ఉంది. సిరాజ్‌తో పాటు రవిచంద్రన్ అశ్విన్, కుల్‌దీప్ యాదవ్ కూడా జట్టుకు కీలకమని నిరూపించుకోవచ్చు.
మహ్మద్ సిరాజ్
సిరాజ్ టీం ఇండియా తరఫున ఇప్పటి వరకు 30 వన్డే మ్యాచ్‌లు ఆడాడు. ఈ సమయంలో అతను 54 వికెట్లు తీశాడు. ఆసియా కప్‌తో పాటు ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లో సిరాజ్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో కేవలం 21 పరుగులకే 6 వికెట్లు పడగొట్టాడు. ఇప్పుడు మరోసారి ప్రపంచకప్‌లో అద్భుతాలు చేయగలడు అని ఫ్యాన్స్ భావిస్తున్నారు. సిరాజ్ టీమ్ ఇండియాకు గేమ్ ఛేంజర్ అని నిరూపించుకునే అవకాశం ఉంది.
Also Read: World Cup 2023: ప్రపంచ కప్ దగ్గరపడుతోంది, హోటళ్లు యమ కాస్ట్‌లీ గురూ..
కుల్దీప్ యాదవ్
టీమ్ ఇండియా స్పిన్నర్ కుల్దీప్ చాలా సందర్భాలలో అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అనుభవజ్ఞుడు. కుల్దీప్ పెద్ద మ్యాచ్‌లలో కూడా మంచి ప్రదర్శన కనబరిచాడు. 90 వన్డేల్లో 152 వికెట్లు తీశాడు. ప్రపంచకప్‌లో భారత్‌కు కుల్దీప్ అద్భుతంగా బౌలింగ్ చేసే ఛాన్స్ ఉంది. యాదవ్ భారతదేశంలోని చాలా మైదానాల్లో ఆడాడు. కాబట్టి ఈ అనుభవం కుల్దీప్ కి చాలా సహాయపడుతుంది.
రవిచంద్రన్ అశ్విన్
2023 ప్రపంచకప్‌లో అశ్విన్‌ను టీమ్‌ఇండియాలో చేర్చారు. వన్డేల్లో 155 వికెట్లు తీశాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అశ్విన్ ఎన్నోసార్లు అద్భుతాలు చేశాడు. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్ సహా అన్ని జట్లకు అశ్విన్ బౌలింగ్ ఆడడం అంత సులువు కాదు. అశ్విన్ టెస్టుల్లో 489 వికెట్లు తీశాడు. ఈ వరల్డ్ కప్ లో అశ్విన్ తన స్పిన్ తో మాయాజాలం చేయగలడని టీమిండియా అభిమానులు ఆశిస్తున్నారు.