Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ (Champions Trophy 2025) ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీ కోసం యావత్ క్రికెట్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ నేపథ్యంలో గత ఛాంపియన్స్ ట్రోఫీ వివరాలను తెలుసుకోవాలనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. ఛాంపియన్స్ ట్రోఫీని 1998లో ప్రారంభించారు. ఇప్పటివరకు 8 సీజన్లు పూర్తి అయ్యాయి. ఇప్పుడు 9వ ఎడిషన్ ని పాకిస్థాన్‌లో నిర్వహించబోతున్నారు. ఈ టోర్నీలో ఇప్పటి వరకు ఆయా జట్లు రెండు సార్లు టైటిల్ గెలుచుకున్నాయి.
చివరిసారిగా 2017లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నీ ఫైనల్‌లో భారత్‌ను ఓడించి పాకిస్థాన్ తొలి టైటిల్ గెలుచుకుంది. అయితే వన్డే, టీ20 ప్రపంచకప్‌లను గెలుచుకున్న ఇంగ్లాండ్ మాత్రం ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్‌ను ఒక్కసారికూడా గెలుచుకోలేకపోయింది. 2010, 2022 టీ20 ప్రపంచకప్‌ను ఇంగ్లండ్ గెలుచుకుంది. దీంతో పాటు 2019 వన్డే ప్రపంచకప్‌ను కూడా గెలుచుకుంది. నిజానికి ఛాంపియన్స్ ట్రోఫీలో ఇంగ్లండ్ రెండుసార్లు ఫైనల్స్ ఆడింది. కానీ రెండు సార్లు ఓటమిని చవిచూసింది. 2004లో ఫైనల్‌లో వెస్టిండీస్ చేతిలో ఇంగ్లండ్ ఓడిపోగా, 2013లో భారత్ చేతిలో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. మరి ఇప్పుడు ఇంగ్లాండ్ తన మొదటి టైటిల్‌ను గెలుచుకుంటుందా తెలియాలంటే మార్చి 9 వరకు ఆగాల్సిందే.
Also Read: Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీలో గంగూలీ, సచిన్, సెహ్వాగ్‌ల విధ్వంసం
ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్లలో ఆస్ట్రేలియా, భారత్ అగ్రస్థానంలో ఉన్నాయి. 2006, 2009లో ఆస్ట్రేలియా ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిచింది. 2022లో శ్రీలంకతో కలిసి భారత్ ఉమ్మడి విజేతగా నిలవగా, 2013లో భారత్ ఒంటరిగా టైటిల్ నెగ్గింది. 1998లో దక్షిణాఫ్రికా, 2000లో న్యూజిలాండ్, 2004లో వెస్టిండీస్, 2017లో పాకిస్థాన్ టైటిల్ గెలిచాయి.