Site icon HashtagU Telugu

ICC World Cup: వన్డే ప్రపంచకప్‌ షెడ్యూల్‌ విడుదల చేసిన ఐసీసీ, భారత్, పాక్ మ్యాచ్ ఎప్పుడంటే!

Upcoming ICC Tournaments

Upcoming ICC Tournaments

క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్.. త్వరలోనే వరల్డ్ కప్ పోటీలు జరుగబోతున్నాయి. ముంబైలో ICC క్రికెట్ ప్రపంచ కప్ 2023 షెడ్యూల్‌ను ప్రకటించాయి. టోర్నీ అక్టోబర్ 5న ప్రారంభమై నవంబర్ 19న ఫైనల్‌తో ముగుస్తుంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్, ముంబైలోని వాంఖడే క్రికెట్ గ్రౌండ్‌లు సెమీస్ మ్యాచ్ లకు ఆతిథ్యం ఇవ్వనున్నాయి, ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియంలో జరుగుతుంది. ప్రపంచంలో ఇదే అతి పెద్ద స్టేడియం. అక్టోబర్ 5న అహ్మదాబాద్‌లో ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌ల మధ్య తొలి మ్యాచ్‌తో టోర్నీ ప్రారంభమవుతుంది. ఆతిథ్య భారత్‌ తన తొలి మ్యాచ్‌ని అక్టోబర్‌ 8న ఆస్ట్రేలియాతో చెన్నైలో అక్టోబర్‌ 8న ఆడనుంది.

వన్డే ప్రపంచకప్‌ షెడ్యూల్‌ విడుదల చేసిన ఐసీసీ

అక్టోబర్‌ 5 నుంచి నవంబర్‌ 19 వరకు వన్డే ప్రపంచకప్ మ్యాచ్‌లు

అక్టోబర్‌ 8న ఆస్ట్రేలియాతో తలపడనున్న భారత్‌

అహ్మదాబాద్‌ వేదికగా అక్టోబర్ 15న భారత్‌-పాక్‌ మ్యాచ్‌

లీగ్‌ దశలో 8 మ్యాచ్‌లు ఆడనున్న భారత్‌

అహ్మదాబాద్‌ వేదికగా నవంబర్‌ 19న ఫైనల్‌ మ్యాచ్‌

ముంబయి, కోల్‌కతా వేదికగా సెమీఫైనల్‌ మ్యాచ్‌లు

నవంబర్‌ 15, 16 తేదీల్లో సెమీఫైనల్‌ మ్యాచ్‌లు

హైదరాబాద్‌లో 3 వన్డే ప్రపంచకప్‌ మ్యాచ్‌లు నిర్వహణ

Also Read: Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కు అస్వస్థత.. వారాహి యాత్రకు స్మాల్ బ్రేక్