IPL 2025: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ సీజన్ ప్రారంభం కావడానికి ఇప్పుడు కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఐపీఎల్ 2025 (IPL 2025) మార్చి 22 నుండి ప్రారంభమవుతుంది. మొదటి మ్యాచ్ కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరుగుతుంది. ఈసారి ఐపీఎల్ సీజన్ చాలా ఉత్కంఠభరితంగా సాగే అవకాశం ఉంది. అయితే చాలా మంది క్రికెట్ అభిమానులకు బ్యాడ్ న్యూస్ కూడా ఉంది. ఈసారి చాలా మంది అనుభవజ్ఞులైన ఆటగాళ్ళు IPL నుండి రిటైర్మెంట్ ప్రకటించవచ్చు. ఇందులో MS ధోని పేరు కూడా ఉంది.
ఎంఎస్ ధోని (సీఎస్కే)
చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఐపీఎల్ 2025 తర్వాత రిటైర్మెంట్ ప్రకటించవచ్చు. 43 ఏళ్ల వయసులో ధోనీ ఐపీఎల్‌లో పటిష్ట ప్రదర్శన చేసేందుకు పూర్తిగా సిద్ధమయ్యాడు. ధోనీ వయస్సును పరిగణనలోకి తీసుకుంటే, ఈ సీజన్ ధోనికి చివరిది కావచ్చు. ఇదే జరిగితే కోట్లాది మంది అభిమానుల గుండె పగిలిపోయే అవకాశం ఉంది.
Also Read: Thursday: డబ్బు కొరతతో ఇబ్బంది పడుతున్నారా.. అయితే గురువారం రోజు ఇలా చేయాల్సిందే!
ఇషాంత్ శర్మ (గుజరాత్ టైటాన్స్)
ఇషాంత్ శర్మకు ఐపీఎల్‌లో మంచి అనుభవ ఉంది. ఈసారి 2008 నుంచి 2025 వరకు ఐపీఎల్‌లో ఆడుతున్న రికార్డు సృష్టించిన ఏకైక ఆటగాడిగా నిలిచాడు. అయితే, ఈసారి అతనికి ఇదే చివరి సీజన్ కావచ్చు.
ఫాఫ్ డుప్లెసిస్ (ఢిల్లీ క్యాపిటల్స్)
వేలంలో ఆర్‌సీబీ మాజీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది. 40 ఏళ్ల వయసులో డుప్లెసిస్ అద్భుత ప్రదర్శన చేయగలడు. అయితే ఈసారి రాణించలేకపోతే ఐపీఎల్ నుంచి తప్పుకోవచ్చు.
కర్ణ్ శర్మ (ముంబై ఇండియన్స్)
ఐపీఎల్ వేలంలో కర్ణ్ శర్మను ముంబై ఇండియన్స్ రూ.50 లక్షలకు కొనుగోలు చేసింది. అయితే శర్మకు అనుభవానికి లోటు లేదు. అయితే ఈ ఏడాది రాణించలేకపోతే ఐపీఎల్ 2025 నుంచి తప్పుకోవచ్చు.
మొయిన్ అలీ (KKR)
ఐపీఎల్ 2025 వేలంలో ఇంగ్లండ్ అనుభవజ్ఞుడైన ఆల్ రౌండర్ మొయిన్ అలీని కోల్‌కతా నైట్ రైడర్స్ రూ. 2 కోట్లకు కొనుగోలు చేసింది. మొయిన్ తన బంతి, బ్యాటింగ్‌తో IPLలో ప్రదర్శన చేయగలడు. అతను ఈసారి కూడా అదే చేయగలడు. కానీ అలా కుదరకపోతే ఈసారి అతనికి చివరి సీజన్ అని తేలిపోవచ్చు.