Telugu IPL Players: 2 రోజుల పాటు జరిగిన ఈ వేలంలో (Telugu IPL Players) 10 ఫ్రాంచైజీలు పోటీ పడ్డాయి. 2 రోజుల్లో 639.15 కోట్లు ఖర్చు చేశాయి. వేలంలో మొత్తం 182 మంది ఆటగాళ్లు అమ్ముడుపోయారు. వీరిలో 62 మంది విదేశీ ఆటగాళ్లు కూడా ఉన్నారు. గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్, చెన్నై సూపర్ కింగ్స్ 25 మంది ఆటగాళ్లను కొనుగోలు చేశాయి. హైదరాబాద్ కేవలం 20 మంది ఆటగాళ్లను మాత్రమే కొనుగోలు చేసింది. తొలిరోజు వేలంలో 72 మంది ఆటగాళ్లు అమ్ముడుపోయారు. ఇందులో 24 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. రెండో రోజు 10 జట్లు 72 మంది ఆటగాళ్లపై 467.95 కోట్లు ఖర్చు చేశాయి.
ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా రిషబ్ పంత్ నిలిచాడు. వేలం మొదటి రోజు లక్నో సూపర్ జెయింట్స్ అతడిని 27 కోట్లకు కొనుగోలు చేసింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, లక్నో సూపర్ జెయింట్స్ మరియు సన్‌రైజర్స్ హైదరాబాద్ కూడా పంత్ కోసం తీవ్రంగా పోటీ పడ్డాయి. అయితే లక్నో భారీ ధరకు అతడిని దక్కించుకుంది. వేలంలో శ్రేయాస్ అయ్యర్ కూడా ధనవంతుడయ్యాడు. 26 కోట్ల 75 లక్షల బిడ్‌తో శ్రేయాస్ అయ్యర్‌ను పంజాబ్ కింగ్స్ చేర్చుకుంది. వెంకటేష్ అయ్యర్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ 23.75 కోట్లు చెల్లించి కొనుగోలు చేసింది. అర్ష్‌దీప్ సింగ్‌ను పంజాబ్ కింగ్స్ 18 కోట్లకు కొనుగోలు చేసింది. దీంతో పాటు యుజువేంద్ర చాహల్‌పై పంజాబ్ రూ.18 కోట్లు ఖర్చు చేసింది. మెగావేలంలో 13 ఏళ్ళ కుర్రాడు అందర్నీ ఆశ్చర్యపరిచాడు. బిహార్‌కు చెందిన 13 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ను రాజస్థాన్ రాయల్స్ 1.10 కోట్లు చెల్లించి దక్కించుకుంది. ఇదిలా ఉండగా వేలంలో తెలుగు కురాళ్ళ సత్తా చాటారు.
Also Read: Billionaire To Monk : ప్రపంచంలోనే సంపన్న సన్యాసి.. రూ.40వేల కోట్ల ఆస్తిని వదిలేశాడు
గుంటూరుకు చెందిన 20 ఏళ్ల షేక్ రషీద్ ను చెన్నై సూపర్ కింగ్స్ కనీస ధర 30 లక్షలు వెచ్చించి సొంతం చేసుకుంది.గత సీజన్‌లోనూ రషీద్ సీఎస్కేకు ప్రాతినిథ్యం వహించిన సంగతి తెలిసిందే. అయితే గత వేలంలో రషీద్ని 20 లక్షల కనీస ధరకు చెన్నై సొంతం చేసుకుంది. అయితే తుది జట్టులో ఆడే అవకాశం రాకపోయినా, సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్‌గా స్టన్నింగ్ క్యాచ్ అందుకుని అందరి దృష్టి ఆకర్షించాడు. విశాఖపట్నంకు చెందిన 24 ఏళ్ల పైల అవినాష్‌ను 30 లక్షల కనీస ధరతో పంజాబ్ కింగ్స్ సొంతం చేసుకుంది. ఈ కుర్రాడు ఆంధ్ర ప్రీమియర్ లీగ్‌లో సెంచరీతో అలరించాడు. కాకినాడ ఫాస్ట్ బౌలర్ సత్యనారాయణ రాజును ముంబై ఇండియన్స్ 30 లక్షలు వెచ్చించి దక్కించుకుంది.
ముంబై జట్టులో ఉన్న తెలుగు తేజం తిలక్ వర్మతో కలిసి సత్యనారాయణ బరిలోకి దిగే అవకాశం ఉంది. ఇక శ్రీకాకుళం కుర్రాడు త్రిపురణ విజయ్‌ను 30 లక్షలతో ఢిల్లీ క్యాపిటల్స్ తీసుకుంది.మొత్తంగా హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్‌తో సహా మనోళ్లు అయిదుగురు మెగావేలంలో అమ్ముడుపోయారు. సిరాజ్ కోసం గుజరాత్ టైటాన్స్ రూ.12.25 కోట్లు ఖర్చుపెట్టింది. తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డిని సన్‌రైజర్స్ హైదరాబాద్ 6 కోట్లు వెచ్చించి రిటైన్ చేసుకుంది.