టీ-20 ప్రపంచ కప్ 2026.. టీమిండియా ఓపెనింగ్ జోడీ ఎవరు?

కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఇక్కడ బ్యాటింగ్‌కు రానున్నారు. 2025లో ఆయన ఫామ్ ఆశించిన స్థాయిలో లేకపోయినా కీలక మ్యాచ్‌ల్లో ఆయన అనుభవం జట్టుకు ముఖ్యం.

Published By: HashtagU Telugu Desk
T20 World Cup

T20 World Cup

T20 World Cup: 2026 టీ-20 ప్రపంచ కప్ కోసం భారత జట్టును ప్రకటించారు. ఈ జట్టులో స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ రెండేళ్ల తర్వాత తిరిగి చోటు దక్కించుకోవడం విశేషం. కిషన్ చివరిసారిగా 2023లో భారత్ తరపున ఆడారు. ఫిబ్రవరి 7న అమెరికాతో జరిగే మ్యాచ్‌తో టీమిండియా తన ప్రపంచ కప్ వేటను ప్రారంభించనుంది.

ఓపెనింగ్ జోడీ ఎవరు?

తొలి మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ జట్టులో ఉన్నప్పటికీ తుది జట్టులో మాత్రం సంజూ శాంస‌న్‌, అభిషేక్ శర్మలు ఓపెనర్లుగా బరిలోకి దిగే అవకాశం ఉంది. సంజూ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉండగా అభిషేక్ శర్మ 2025 సంవత్సరంలో 1600 కంటే ఎక్కువ పరుగులు సాధించి రికార్డు సృష్టించారు.

బలమైన మిడిలార్డర్

నంబర్ 3: కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఇక్కడ బ్యాటింగ్‌కు రానున్నారు. 2025లో ఆయన ఫామ్ ఆశించిన స్థాయిలో లేకపోయినా కీలక మ్యాచ్‌ల్లో ఆయన అనుభవం జట్టుకు ముఖ్యం.

నంబర్ 4: యువ సంచలనం తిలక్ వర్మ బ్యాటింగ్‌కు వచ్చే అవకాశం ఉంది. ఆసియా కప్ 2025, సౌత్ ఆఫ్రికా సిరీస్‌లో తిలక్ అద్భుత ప్రదర్శన చేశారు.

లోయర్ మిడిలార్డర్: హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్‌లు ఫినిషర్లుగా బాధ్యతలు చేపడతారు.

Also Read: రోజూ బ్రష్ చేస్తున్నారా? ప్లాస్టిక్ బ్రష్‌లు, టూత్‌పేస్ట్‌ల గురించి నిపుణుల హెచ్చరిక!

బౌలింగ్ విభాగం

స్పిన్ బాధ్యతలను అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి పంచుకోనుండగా.. పేస్ విభాగంలో జస్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, శివమ్ దూబే ప్రత్యర్థిని అడ్డుకోనున్నారు.

అమెరికాతో మ్యాచ్ కోసం భారత ప్లేయింగ్ 11 (అంచ‌నా)

అభిషేక్ శర్మ, సంజూ శాంస‌న్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ (వైస్ కెప్టెన్), శివమ్ దూబే, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, జస్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్.

ప్రపంచ కప్ 2026, న్యూజిలాండ్ పర్యటనకు పూర్తి భారత జట్టు

సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజూ శామ్సన్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్ (వైస్ కెప్టెన్), రింకూ సింగ్, జస్‌ప్రీత్ బుమ్రా, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, వాషింగ్టన్ సుందర్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్).

  Last Updated: 22 Dec 2025, 07:55 PM IST