IND vs AUS: భారత జట్టుపై పెళ్లిళ్ల సీజన్‌ ఎఫెక్ట్ ‌.. టీమ్‌తో దూరంగా కోహ్లీ

బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీలో భాగంగా ఫిబ్రవరి 17 నుంచి భారత్, ఆస్ట్రేలియా (IND vs AUS) మధ్య రెండో టెస్టు మ్యాచ్‌ ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌కు ఢిల్లీలోని అరుణ్‌ జైట్లీ స్టేడియం ఆతిథ్యం ఇస్తుంది.

  • Written By:
  • Publish Date - February 17, 2023 / 01:55 PM IST

బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీలో భాగంగా ఫిబ్రవరి 17 నుంచి భారత్, ఆస్ట్రేలియా (IND vs AUS) మధ్య రెండో టెస్టు మ్యాచ్‌ ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌కు ఢిల్లీలోని అరుణ్‌ జైట్లీ స్టేడియం ఆతిథ్యం ఇస్తుంది. దీంతో ఇరుజట్లు దేశ రాజధానిలో బస చేశాయి. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్‌ కావడం, ఇదే ఏడాది దిల్లీలో జీ 20 సదస్సు ఉండటంతో అక్కడ ఫైవ్‌ స్టార్‌ హోటల్స్‌లో చాలా గదులు ముందుగానే రిజర్వ్ చేసుకున్నారు. ఈ ప్రభావం కాస్త టీమ్‌ఇండియాపై పడింది. ఎప్పుడూ బస చేసే హోటల్‌లో కాకుండా హఠాత్తుగా మరో హోటల్‌కి షిప్ట్‌ అయింది. భారత క్రికెట్ జట్టు సాధారణంగా ఢిల్లీలోని తాజ్ ప్యాలెస్ లేదా ఐటీసీ మౌర్యలో బస చేస్తుంది. ఈసారి మాత్రం కర్కర్దుమాలోని హోటల్ లీలాలో బస చేస్తున్నట్లు తెలుస్తోంది.

స్పోర్ట్స్ అధికారుల నుండి వచ్చిన నివేదిక ప్రకారం.. టీమ్ ఇండియాను ఈసారి కర్కర్డూమాలోని హోటల్ లీలాలో బస చేశారు. విరాట్ కోహ్లీతో పాటు జట్టులోని ఆటగాళ్లందరూ ఇక్కడ ఉన్నారు. అయితే విరాట్ కోహ్లీ జట్టు సభ్యులతో బస చేయలేదు. కోహ్లీ ఢిల్లీలోని తన ఇంట్లోనే ఉంటున్నాడు. విరాట్ కోహ్లీ తన కుటుంబంతో కలిసి ఢిల్లీలో ఉంటున్నాడు. కోహ్లికి గురుగ్రామ్‌లో ఇల్లు ఉంది. అతను తన కుటుంబ సభ్యులతో అక్కడే ఉంటున్నాడు. కోహ్లీ తన కుటుంబంతో కొంత సమయం గడపాలనుకుంటున్నాడు. అందుకే కోహ్లీ జట్టు సభ్యులతో బస చేయలేదు. అంతకుముందు అంటే ఫిబ్రవరి 15న కోహ్లీ తన వ్యక్తిగత కారులో ప్రాక్టీస్ కోసం అరుణ్ జైట్లీ స్టేడియంకు చేరుకున్నాడు. ఈ విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడం ద్వారా తెలియజేశాడు.

Also Read: Chetan Sharma: బీసీసీఐ చీఫ్ సెలక్టర్ పదవికి చేతన్ శర్మ రాజీనామా

విరాట్ కోహ్లీ చాలా కాలంగా టెస్టు క్రికెట్‌లో ఫ్లాప్‌ అవుతున్నాడు. నాగ్‌పూర్‌లో జరిగిన తొలి టెస్టులో అతను 26 బంతుల్లో 12 పరుగులు మాత్రమే చేశాడు. 2019లో తన చివరి టెస్టు సెంచరీ సాధించాడు. దీని తర్వాత 2020, 2021, 2022లో అతని టెస్ట్ సగటు కూడా చాలా ఘోరంగా ఉంది. మూడు సంవత్సరాలలో అతను వరుసగా 19.33, 28.21, 26.50 సగటుతో పరుగులు చేశాడు. కోహ్లీ తన కెరీర్‌లో ఇప్పటివరకు మొత్తం 105 టెస్టులు ఆడాడు. ఈ మ్యాచ్‌లలో 178 ఇన్నింగ్స్‌లలో అతను 48.68 సగటుతో 8131 పరుగులు చేశాడు. ఇందులో అతని బ్యాట్‌ నుంచి 27 సెంచరీలు, 28 హాఫ్‌ సెంచరీలు వచ్చాయి. నాగ్‌పూర్‌లో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భారత్ 1-0 ఆధిక్యంలో ఉంది.