Highest Score: భారత్- ఇంగ్లాండ్ మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో రెండో మ్యాచ్ బుధవారం నుంచి బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ మైదానంలో జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు రెండో రోజు గురువారం భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 10 వికెట్ల నష్టానికి 587 పరుగులు పరుగుల మైలురాయిని దాటింది. భారత జట్టు ఈ ఇన్నింగ్స్‌లో 600 పరుగుల మార్క్‌ను చేరుకుంటుదనుకున్నారు. కానీ 13 పరుగుల దూరంలోనే టీమిండియా ఆలౌట్ కావాల్సి వచ్చింది. టీమ్ ఇండియా ఇంగ్లాండ్‌లో తన అతిపెద్ద స్కోరును 2007లో ఓవల్ మైదానంలో సాధించింది. 18 సంవత్సరాల క్రితం భారత్ ఇంగ్లాండ్‌లో తన అతిపెద్ద స్కోరు (Highest Score) సాధించింది.
భారత జట్టు 2007లో ఓవల్ మైదానంలో ఇంగ్లాండ్‌లో తన అతిపెద్ద స్కోరు సాధించింది. ఈ మైదానంలో భారత జట్టు 664 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు తరపున దినేష్ కార్తీక్, రాహుల్ ద్రవిడ్, సచిన్ టెండూల్కర్, వీవీఎస్ లక్ష్మణ్, ఎంఎస్ ధోనీ అద్భుతమైన అర్ధ సెంచరీలు సాధించారు. అలాగే, అనిల్ కుంబ్లే ఈ మ్యాచ్‌లో సెంచరీ సాధించాడు. దీని కారణంగా భారత్ ఇంత పెద్ద స్కోరు సాధించగలిగింది. ఇంగ్లాండ్‌లో భారత్ రెండో అతిపెద్ద స్కోరు లీడ్స్ మైదానంలో 628 పరుగులు, మూడో అతిపెద్ద స్కోరు ఓవల్ మైదానంలో 606 పరుగులు.
రికార్డు సృష్టించిన గిల్
శుభ్‌మన్ గిల్ ఎడ్జ్‌బాస్టన్ మైదానంలో టెస్ట్ క్రికెట్ చరిత్రలో సంవత్సరాల తరబడి గుర్తుండిపోయే అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఇంగ్లాండ్ గడ్డపై భారత్ తరపున అతిపెద్ద ఇన్నింగ్స్ ఆడిన బ్యాట్స్‌మన్‌గా గిల్ నిలిచాడు. అతను 387 బంతులు ఎదుర్కొని 269 పరుగులతో గుర్తుండిపోయే ఇన్నింగ్స్ ఆడాడు. ఈ ఇన్నింగ్స్ సమయంలో గిల్ 30 ఫోర్లు, 3 సిక్సర్లు సాధించాడు.
గిల్ భారత కెప్టెన్‌గా అతిపెద్ద ఇన్నింగ్స్ ఆడిన బ్యాట్స్‌మన్‌గా రికార్డు సృష్టించాడు. అలాగే ఇంగ్లాండ్‌లో అతిపెద్ద ఇన్నింగ్స్ ఆడిన రికార్డు కూడా శుభ్‌మన్ గిల్ పేరిట నమోదైంది. అతను సునీల్ గవాస్కర్ 46 ఏళ్ల నాటి రికార్డును బద్దలు కొట్టాడు. అంతే కాకుండా ఇంగ్లాండ్‌లో డబుల్ సెంచరీ, 250 పరుగులు సాధించిన తొలి భారత కెప్టెన్‌గా కూడా గిల్ నిలిచాడు.