టీ20 వరల్డ్ కప్ 2026.. ఈ ఆట‌గాళ్లంతా భార‌త సంత‌తికి చెందిన ఆట‌గాళ్లే!

భారత్ అమెరికాపై విజయం సాధించగా, పాకిస్థాన్ నెదర్లాండ్స్‌ను ఓడించింది. ఈ మెగా టోర్నమెంట్‌లో మొత్తం 20 దేశాలు పాల్గొంటున్నాయి. అయితే ఈ 20 జట్లలో కలిపి మొత్తం 41 మంది భారత సంతతి ఆటగాళ్లు వివిధ దేశాల తరపున ఆడుతుండటం విశేషం.

Published By: HashtagU Telugu Desk
T20 World Cup 2026

T20 World Cup 2026

T20 World Cup 2026: టీ20 వరల్డ్ కప్ 2026 ఫిబ్రవరి 7న ఘనంగా ప్రారంభమైంది. తొలి రోజే భారత్, పాకిస్థాన్‌లతో సహా పలు దేశాలు మైదానంలోకి దిగాయి. భారత్ అమెరికాపై విజయం సాధించగా, పాకిస్థాన్ నెదర్లాండ్స్‌ను ఓడించింది. ఈ మెగా టోర్నమెంట్‌లో మొత్తం 20 దేశాలు పాల్గొంటున్నాయి. అయితే ఈ 20 జట్లలో కలిపి మొత్తం 41 మంది భారత సంతతి ఆటగాళ్లు వివిధ దేశాల తరపున ఆడుతుండటం విశేషం. సౌత్ ఆఫ్రికా నుండి న్యూజిలాండ్ వరకు బలమైన జట్లలో కూడా భారత మూలాలున్న ఆటగాళ్లు ఉన్నారు.

కెనడా, అమెరికా జట్లలో అత్యధికంగా..

కెనడా జట్టులో అత్యధికంగా 11 మంది భారత సంతతి ఆటగాళ్లు ఉండగా అమెరికా జట్టులో 9 మంది ఉన్నారు. విశేషమేమిటంటే.. ఈ రెండు జట్ల కెప్టెన్లు కూడా భారత సంతతికి చెందినవారే. కెనడాకు దిల్‌ప్రీత్ బజ్వా, అమెరికాకు మొనాంక్ పటేల్ నాయకత్వం వహిస్తున్నారు.

Also Read: ‘ఆపరేషన్ సిందూర్’ దెబ్బకు వణికిన పాకిస్థాన్.. భోలారి ఎయిర్‌బేస్ మరమ్మతుల్లో పాక్‌!

వివిధ దేశాల వారీగా భారత సంతతి ఆటగాళ్ల జాబితా

కెనడా (11 మంది): దిల్‌ప్రీత్ బజ్వా (కెప్టెన్), నవనీత్ ధాలివాల్, రవీందర్‌పాల్ సింగ్, కన్వర్‌పాల్ తత్గుర్, శ్రేయస్ మోవ్వా, అంశ్ పటేల్, యువరాజ్ శర్మ, అజయ్‌వీర్ హుందల్, హర్ష్ ఠాకర్, శివం శర్మ, జస్కీరన్ సింగ్.

అమెరికా – USA (9 మంది): సౌరభ్ నేత్రవల్కర్, మొనాంక్ పటేల్ (కెప్టెన్), శుభమ్ రంజనే, సంజయ్ కృష్ణమూర్తి, హర్మీత్ సింగ్, మిలింద్ కుమార్, సాయితేజ ముక్కామల్ల, జెస్సీ సింగ్, నోస్తుష్ కెంజిగే.

యూఏఈ – UAE (7 మంది): అలీషాన్ షరాఫు, ఆర్యన్ శర్మ, సిమ్రన్‌జీత్ సింగ్, మయాంక్ కుమార్, ధృవ్ పరాశర్, హర్షిత్ కౌశిక్, రోహిద్ సింగ్.

ఓమన్ (7 మంది): జతీందర్ సింగ్, వినాయక్ శుక్లా, అశీష్ ఓదేదరా, జయ్ ఓదేదరా, కరణ్ సోనావలే, జితేన్ రామానంది, వాసిమ్ అలీ.

న్యూజిలాండ్ (2 మంది): రచిన్ రవీంద్ర, ఈష్ సింగ్ సోధి.

నెదర్లాండ్స్ (2 మంది): ఆర్యన్ దత్ (ఆఫ్-స్పిన్నర్), విక్రమ్‌జీత్ సింగ్ (ఓపెనర్).

ఇతర దేశాలు (ఒక్కొక్కరు చొప్పున)

  • సౌత్ ఆఫ్రికా: కేశవ్ మహారాజ్.
  • వెస్టిండీస్: గుడకేశ్ మోతీ.
  • ఇటలీ: జస్ప్రీత్ సింగ్.
  Last Updated: 08 Feb 2026, 08:47 PM IST