టీ20 వరల్డ్ కప్ 2026.. భారత్, శ్రీలంక వేదికగా సమరం!

ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో వార్మప్ మ్యాచ్ నిర్వహించేందుకు బిసిసిఐ ఏర్పాట్లు చేస్తోంది. ఈ మ్యాచ్ దక్షిణాఫ్రికాతో లేదా ఇండియా-ఏ జట్టుతో జరిగే అవకాశం ఉంది.

Published By: HashtagU Telugu Desk
T20 World Cup 2026

T20 World Cup 2026

T20 World Cup 2026: టీ20 వరల్డ్ కప్ 2026 ఫిబ్రవరి 7 నుండి ప్రారంభం కానుంది. దీనికి భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి. గ్రూప్-బి మ్యాచ్‌ల‌న్నీ శ్రీలంకలో జరుగుతాయి. అలాగే పాకిస్థాన్ కూడా తన మ్యాచ్‌లన్నీ శ్రీలంకలోనే ఆడనుంది. టోర్నమెంట్ ప్రారంభానికి ముందు భారత్ ఒక ప్రాక్టీస్ మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఇది ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో జరగనుంది. తిలక్ వర్మ విషయంలో శుభవార్త రాగా.. ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ టోర్నమెంట్‌కు దూరమయ్యే అవకాశం ఉంది.

తిలక్ వర్మ ఫిట్, సుందర్ దూరం?

వాషింగ్టన్ సుందర్, తిలక్ వర్మ గాయాలు టీమ్ ఇండియాకు ఆందోళన కలిగించాయి. అయితే తిలక్ ఇప్పుడు పూర్తిగా కోలుకున్నట్లు సమాచారం. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదిక ప్రకారం.. న్యూజిలాండ్‌తో జరిగే ఐదో టీ20కి తిలక్ అందుబాటులో ఉంటాడు. అయితే మేనేజ్‌మెంట్ అతడిని టీ20 వరల్డ్ కప్ కోసం పూర్తి ఫిట్‌గా ఉంచాలని భావిస్తోంది.

Also Read: బండ్లపై ‘ప్రెస్’, ‘పోలీస్’, ‘గవర్నమెంట్’ స్టిక్కర్లు వేస్తే.. వాహనం సీజ్.. తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం !

వాషింగ్టన్ సుందర్ రీప్లేస్‌మెంట్

సైడ్ స్ట్రెయిన్ (కండరాల గాయం) కారణంగా వాషింగ్టన్ సుందర్ జట్టుకు దూరంగా ఉన్నాడు. సుందర్ కోలుకోవడం నెమ్మదిగా సాగుతోందని, దీనివల్ల అతను టీ20 వరల్డ్ కప్‌కు దూరం కావచ్చని తెలుస్తోంది. వాషింగ్టన్ స్థానంలో రియాన్ పరాగ్ పేరు బలంగా వినిపిస్తోంది. బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో అతడిని సిద్ధంగా ఉండమని కోరారు. జనవరి 28, 30 తేదీల్లో పరాగ్ రెండు సిమ్యులేషన్ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఒకవేళ అతను ఫిట్‌నెస్ టెస్ట్ పాస్ అయితే జట్టుతో చేరమని అతనికి పిలుపు రావచ్చు.

న్యూజిలాండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో వాషింగ్టన్ సుందర్ స్థానంలో రవి బిష్ణోయ్‌ని చేర్చారు. అతనికి మూడో టీ20లో ప్లేయింగ్ 11లో అవకాశం దక్కింది. అతను పొదుపుగా బౌలింగ్ చేస్తూ 2 వికెట్లు పడగొట్టాడు. బిసిసిఐ (BCCI) వర్గాల సమాచారం ప్రకారం.. బోర్డు వాషింగ్టన్ పునరాగమనం విషయంలో తొందరపడాలని అనుకోవడం లేదు. అందుకే అతని ప్రత్యామ్నాయాలపై తీవ్రంగా ఆలోచిస్తోంది.

వార్మప్ మ్యాచ్ ఎప్పుడు?

ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో వార్మప్ మ్యాచ్ నిర్వహించేందుకు బిసిసిఐ ఏర్పాట్లు చేస్తోంది. ఈ మ్యాచ్ దక్షిణాఫ్రికాతో లేదా ఇండియా-ఏ జట్టుతో జరిగే అవకాశం ఉంది. దీని ద్వారా టీమ్ ఇండియా తన ప్లేయింగ్ 11కు తుది రూపం ఇస్తుంది. ఏదైనా పెద్ద టోర్నమెంట్‌కు ముందు వార్మప్ మ్యాచ్‌లు కీలక పాత్ర పోషిస్తాయి.

  Last Updated: 26 Jan 2026, 02:47 PM IST