T20 World Cup 2026: టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్ మ్యాచ్ మార్చి 08, ఆదివారం నాడు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య జరగనుంది. ఈ పోరుకు ముందు టోర్నమెంట్ ‘క్లోజింగ్ సెర్మనీ’ (ముగింపు వేడుక) నిర్వహించనున్నారు. ఇందులో అంతర్జాతీయ స్టార్లు తమ ప్రదర్శనతో అలరించనున్నారు. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) క్లోజింగ్ సెర్మనీలో ప్రదర్శన ఇవ్వబోయే కళాకారుల జాబితాను విడుదల చేసింది. ఇందులో అంతర్జాతీయ పాప్ సింగర్ రికీ మార్టిన్ పేరు కూడా ఉంది.
ఐసీసీ అప్‌డేట్
ఐసీసీ విడుదల చేసిన అప్‌డేట్ ప్రకారం.. రికీ మార్టిన్‌తో పాటు మరో ఇద్దరు భారతీయ సింగర్ల పేర్లు కూడా ఉన్నాయి. వారు సుఖ్బీర్, ఫాల్గుణి పాఠక్. ఐసీసీ తన సోషల్ మీడియా పోస్ట్‌లో ఇలా రాసింది.వేదిక మరింత పెద్దదిగా మారుతోంది! టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌కు ముందు జరిగే క్లోజింగ్ సెర్మనీలో గ్లోబల్ సూపర్ స్టార్ రికీ మార్టిన్‌తో పాటు సంగీత దిగ్గజాలు సుఖ్బీర్, ఫాల్గుణి పాఠక్ కూడా చేరనున్నారు! క్రికెట్ చరిత్రలోనే అతిపెద్ద రాత్రి ఈ దిగ్గజ కళాకారులు తమ ప్రదర్శనతో మెప్పించనున్నారు. కాబట్టి గ్లోబల్ హిట్ సాంగ్స్, దేశీ పాటల కోసం సిద్ధంగా ఉండండి అని ట్వీట్ చేసింది.
Also Read: ప్రజా రాజధాని అమరావతిలో అంతర్జాతీయ న్యాయ వర్సిటీ
🎤 The stage keeps getting bigger!
Joining Global Superstar Ricky Martin at the Closing Ceremony before the #T20WorldCup Final are music icons Sukhbir and Falguni Pathak!Get ready for global hits and desi anthems as these legendary artists light up the biggest night in cricket.… pic.twitter.com/8kMK7yg31b
— ICC (@ICC) March 7, 2026
క్లోజింగ్ సెర్మనీ ఎప్పుడు మొదలవుతుంది?
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ సాయంత్రం 7 గంటలకు ప్రారంభమవుతుంది. అంతకంటే ముందు సాయంత్రం 5:30 గంటల నుండి క్లోజింగ్ సెర్మనీ మొదలవుతుంది. ఈ వేడుకలో ముగ్గురు సింగర్ల ప్రదర్శనను చూడవచ్చు.
ఇంగ్లండ్‌ను ఓడించి ఫైనల్‌కు చేరిన భారత్
సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని టీమ్ ఇండియా సెమీఫైనల్‌లో ఇంగ్లండ్‌ను 7 పరుగుల తేడాతో ఓడించి విజయం సాధించింది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగింది. ఇప్పుడు ఫైనల్‌లో భారత్- న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. భారత జట్టు వరుసగా రెండోసారి టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు చేరుకుంది. గత 2024 టీ20 ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ కెప్టెన్సీలో టీమ్ ఇండియా టైటిల్ నెగ్గింది. మరి ఈసారి భారత జట్టు ఎలాంటి ప్రదర్శన చేస్తుందో చూడటం ఆసక్తికరంగా మారింది.
