Site icon HashtagU Telugu

Sandeep Lamichhane: నేపాల్ క్రికెటర్‌కు భారీ షాక్.. వీసా నిరాక‌రించిన అమెరికా..!

Sandeep Lamichhane

Sandeep Lamichhane

Sandeep Lamichhane: టీ-20 ప్రపంచకప్ కోసం చాలా జట్లు అమెరికా చేరుకున్నాయి. కొన్ని జట్లు వార్మప్ మ్యాచ్‌లు కూడా ఆడుతున్నాయి. ప్రపంచకప్ కోసం వారి సన్నాహాలు చూడవచ్చు. జూన్ 2 నుంచి ప్రపంచకప్ ప్రారంభం కానుండగా, అంతకుముందే నేపాల్ జట్టుకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ ప్లేయర్ సందీప్ లమిచానే (Sandeep Lamichhane)కు అమెరికా వీసా నిరాకరించింది. యుఎస్ ఎంబసీ లామిచానేకు వీసా ఇవ్వడానికి నిరాకరించడంతో అతను T20 ప్రపంచ కప్‌లో ఆడే అవకాశాలు చాలా తక్కువగా మారాయి. దీంతో అతను ప్రపంచకప్‌కు దూరమయ్యే అవకాశం ఉంది.

లామిచానే వీసాకు సంబంధించిన వివరాలను నేపాల్ క్రికెట్ గురువారం వెల్లడించింది. ఇంతకు ముందు కూడా సందీప్‌కు వీసా నిరాకరించారు. సందీప్ స్టార్ ప్లేయర్ గానే కాకుండా వివాదాస్పద ఆటగాడు కూడా. అతనిపై అత్యాచారం ఆరోపణలు వచ్చాయి. అతనికి విధించిన ఎనిమిదేళ్ల శిక్షను ఈ నెలలో అప్పీల్‌పై రద్దు చేసింది. అతను నిర్దోషిగా విడుదలయ్యాడు. నేపాల్ జట్టు లామిచానేను చేర్చుకోవాలని భావించింది. అందుకు త‌గ్గిన‌ట్లుగానే జ‌ట్టులోకి చేర్చుకుంది. ఇంత‌లోనే తన యుఎస్ వీసా తిరస్కరించబడిందని మాజీ కెప్టెన్ గత వారం చెప్పాడు. ఈ నిర్ణయం దురదృష్టకరమని ఆయన అన్నారు.

Also Read: Suriya : లారెన్స్ సినిమాలో ‘రోలెక్స్’ క్యామియో.. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్..

నేపాల్ క్రికెట్ అసోసియేషన్ అనేక ఏజెన్సీల ద్వారా US ఎంబసీని సంప్రదించింది. అయితే లామిచానే వీసా పొందడానికి చేసిన‌ అన్ని ప్రయత్నాలు విఫ‌ల‌మ‌య్యాయి. నేపాల్ క్రికెట్ పోస్టర్ బాయ్ సందీప్ లామిచానేకు వీసా నిరాకరించడంపై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఇంతకుముందు అత్యాచారానికి పాల్పడిన కారణంగా అతడిని అసలు జట్టులో చేర్చలేదు. అయితే అమెరికా వీసా అప్రూవ‌ల్ ఇస్తే లామిచానే జట్టులోకి వచ్చే అవకాశం ఉంది.

We’re now on WhatsApp : Click to Join

T20 ప్రపంచ కప్ 2024 కోసం నేపాల్ జట్టు

రోహిత్ పౌడెల్ (కెప్టెన్), దీపేంద్ర సింగ్ ఎయిరీ, ఆసిఫ్ షేక్, అనిల్ కుమార్ సా, కుశాల్ మల్లా, లలిత్ రాజ్‌బన్షి, కరణ్ కెసి, గుల్షన్ ఝా, సోంపాల్ కమీ, ప్రతిస్ జిసి, సందీప్ జోరా, అవినాష్ బోహ్రా, సాగర్ ధాకల్, కమల్ సింగ్ ఎయిరీ, సందీప్ లమిచానే.