Suryakumar Yadav Post: రోహిత్ శర్మ కెప్టెన్సీ తొలగింపు.. సూర్యకుమార్ యాదవ్ హార్ట్ బ్రేక్ పోస్ట్..!?

రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించే నిర్ణయాన్ని ముంబై ఇండియన్స్ అభిమానులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇదిలా ఉంటే భారత టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav Post) దక్షిణాఫ్రికా టూర్‌లో తన ట్విట్టర్ పోస్ట్‌లలో ఒకదానితో యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు.

Published By: HashtagU Telugu Desk
Suryakumar Yadav Post

Safeimagekit Resized Img (3) 11zon

Suryakumar Yadav Post: రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించే నిర్ణయాన్ని ముంబై ఇండియన్స్ అభిమానులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇదిలా ఉంటే భారత టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav Post) దక్షిణాఫ్రికా టూర్‌లో తన ట్విట్టర్ పోస్ట్‌లలో ఒకదానితో యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. టీమిండియా తాత్కాలిక T20 కెప్టెన్ సూర్య కుమార్ ఇన్ స్టోరీ వైరల్ గా మారింది. ఈ పోస్ట్‌కి అభిమానులు రకరకాల అర్థాలు చెబుతున్నారు. టీమ్ ఇండియా బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో హృదయ విదారక (హార్ట్ బ్రేక్) ఎమోజీని పంచుకున్నారు. పోస్ట్ లో ఏమీ రాయలేదు. కానీ అతని అభిమానులు ఈ పోస్ట్‌పై తీవ్రంగా స్పందిస్తున్నారు.

రోహిత్ శర్మ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంపై సూర్యకుమార్ స్పందించారని కొందరు అభిమానులు విశ్వసించగా, ముంబై ఇండియన్స్ సూర్యకుమార్‌కు కెప్టెన్సీ ఇవ్వకపోవడంతో సూర్యకుమార్‌ గుండె పగిలిపోయిందేమో అని భావిస్తున్నారు. మరికొందరు.. రోహిత్ శర్మను ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ నుంచి తప్పించడంతో సూర్య ఇలా రియాక్ట్ అయినట్లు తెలుస్తోంది. గత కొన్నేళ్లుగా రోహిత్, సూర్య ముంబైకి కీలక ఇన్నింగ్స్ లు ఆడుతున్నారు. తాజాగా ముంబై తీసుకున్న నిర్ణయం సూర్యకు కూడా మింగుడు పడట్లేదని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.

Also Read: Shame on MI: ముంబై ఇండియన్స్ కు రోహిత్ శర్మ ఫ్యాన్స్ షాక్.. ‘Shame on MI’ అంటూ ట్విట్టర్ లో ట్రెండింగ్..!

ఇంతకీ సూర్యకుమార్ పెట్టిన ఈ పోస్ట్‌కి అసలు అర్థం ఏమిటి? దీనికి సూర్య మాత్రమే సమాధానం చెప్పగలడు. శుక్రవారం ముంబై ఇండియన్స్ రోహిత్ శర్మను కెప్టెన్సీ నుండి తొలగించిన విషయం తెలిసిందే . ముంబై ఇండియన్స్ కొత్త కెప్టెన్‌గా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాను ఫ్రాంచైజీ నియమించింది. ముంబై ఇండియన్స్ తదుపరి కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్ ఉంటాడని గతంలో ఊహాగానాలు వచ్చాయి.

We’re now on WhatsApp. Click to Join.

  Last Updated: 16 Dec 2023, 12:33 PM IST