Site icon HashtagU Telugu

Suryakumar Yadav : ముంబై ఇండియన్స్ కు బిగ్ షాక్.. కొన్ని మ్యాచ్ లకు సూర్య దూరం?

Big Shock For Mumbai Indians.. Suryakumar Yadav Away From Some Matches..

Big Shock For Mumbai Indians.. Surya Away From Some Matches..

Suryakumar Yadav : ఐపీఎల్ 17వ సీజన్ కు ఫ్రాంచైజీలు సన్నాహాల్లో బిజీగా ఉన్నాయి. ఇటీవలే ముగిసిన మినీ వేలంలో పలువురు ఆటగాళ్ళను కొనుగోలు చేసిన తమ తమ జట్లను బలంగా మార్చుకున్నాయి. ప్రస్తుతం వచ్చే సీజన్ లో తుది జట్టు, ఎవరు అందుబాటులో ఉంటారనే దానిపై ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. అయితే కీలక ఆటగాళ్ల గాయాలు వారిని టెన్షన్ పెడుతున్నాయి. తాజాగా ముంబై ఇండియన్స్ షాక్ తగిలింది. టీమిండియా స్టార్‌ ప్లేయర్ సూర్యకుమార్‌ యాదవ్‌ (Suryakumar Yadav) ఐపీఎల్ 17వ సీజన్ లో కొన్ని మ్యాచ్ లకు దూరంగా కానున్నాడు. ఇప్పటికే చీలమండ గాయంతో బాధపడుతున్న ఈ డాషింగ్‌ బ్యాటర్‌ స్పోర్ట్స్‌ హెర్నియా వల్ల అతడు ఇబ్బందిపడుతున్నట్లు సమాచారం.

We’re now on WhatsApp. Click to Join.

ఈ నేపథ్యంలో సర్జరీ కోసం సూర్యకుమార్‌ (Suryakumar Yadav) జర్మనీ వెళ్లేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బెంగళూరు జాతీయ క్రికెట్‌ అకాడమీలో చికిత్స పొందుతున్న అతను రెండు- మూడు రోజుల్లో సర్జరీ కోసం జర్మనీలోని మ్యూనిచ్‌కు పయనమవుతాడని సన్నిహిత వర్గాలు తెలిపాయి. దీంతో రంజీ ట్రోఫీతో పాటు ఐపీఎల్‌ 2024 ఆరంభ మ్యాచ్‌లకు అందుబాటులో ఉండే అవకాశం లేదు. ఐపీఎల్ ముగిసిన వెంటనే టీ ట్వంటీ వరల్డ్‌కప్‌ మొదలుకానుండడంతో సూర్యకుమార్ పూర్తిస్థాయిలో కోలుకోవాలని బీసీసీఐ భావిస్తోంది. చీలమండ నొప్పి కారణంగానే సూర్యకుమార్‌ యాదవ్‌ ఇప్పటికే అఫ్గనిస్తాన్‌తో టీ ట్వంటీ సిరీస్‌కు దూరమయ్యాడు. కాగా సూర్య ఆరంభ మ్యాచ్‌లకు దూరమైతే ముంబై ఇండియన్స్‌ కు ఎదురుదెబ్బ తగిలినట్టే. ఇప్పటికే కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా గాయంతో ఇబ్బంది పడుతున్నాడు. పాండ్యా రీఎంట్రీపై క్లారిటీ లేకపోవడం, తాజాగా సూర్యకుమార్ గాయం ముంబై మేనేజ్ మెంట్ కు ఆందోళన కలిగిస్తున్నాయి.

Also Read:  Sriram Akhand Jyoti : అయోధ్య రామమందిరంలో అఖండ జ్యోతి.. విశేషాలివీ..